స్వచ్ఛభారత్ నినాదాలతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, పోరాడితేనే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, కాశీనాథ్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ,టీడీపీ అనుసరిస్తున్న మోసపూరిత విధానాలకు నిరసనగా లెనిన్‌సెంటర్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక దీక్షలు చేపట్టారు.
హోదా ఎలా తెస్తావో చెప్పు బాబూ!
Published Fri, Aug 5 2016 11:45 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
–సీపీఐ, సీపీఎం నేతలు శంకర్, కాశీనాథ్ ధ్వజం
గాంధీనగర్ :
స్వచ్ఛభారత్ నినాదాలతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, పోరాడితేనే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, కాశీనాథ్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ,టీడీపీ అనుసరిస్తున్న మోసపూరిత విధానాలకు నిరసనగా లెనిన్‌సెంటర్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక దీక్షలు చేపట్టారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, పి మధు పాల్గొని దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్, కాశీనాథ్‌లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై మాటతప్పాయన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే బంద్‌ను విఫలం చేసేందుకు యత్నించేవారు కాదన్నారు. హోదా కోసం ఉద్యమిస్తుంటే అరెస్ట్‌లు చేసిన చంద్రబాబు తాను ఏ విధంగా హోదా సాధిస్తారో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్షాల బంద్ విఫలమైందని మంత్రులు, ఆర్టీసీకి రూ. 4కోట్ల నష్టం వచ్చిందంటూ ముఖ్యమంత్రి పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారన్నారు. బంద్ విఫలమైతే ఆర్టీసీకీ నష్టం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ దీక్ష శిబిరంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, బిబిఎ అధ్యక్షులు సీహెచ్ మన్మధరావు, మాజీ అధ్యక్షులు సంపర శ్రీనివాసరావు, పిళ్లా రవి, సీపీఐ రాష్ట్ర నాయకులు ఆర్ రవీంద్రనాథ్, జి కోటేశ్వరరావు, పల్లా సూర్యారావు, మహిళా సంఘం నాయకులు దుర్గాంబ, సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, యువి రామారాజు, ఆర్ కోటేశ్వరరావు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement