
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివిధ వామపక్షాలు (లెఫ్ట్ పార్టీలు) ప్రకటించాయి. హైదరాబాద్‌లో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు, అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇతర పార్టీలు, సామాజిక సంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. సోమవారం మఖ్దూంభవన్‌లో సీపీఎం కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి, గుండ మల్లేశ్ తదితరులు ఈ మేరకు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment