సాక్షి, విజయవాడ: ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక వన్‌టౌన్ ఆంధ్రా బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు మాట్లాడుతూ.. 90 వేల శాఖలు కలిగిన ఆంధ్రాబ్యాంక్‌ను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధి కోసమే విలీనం చేస్తున్నామంటూ.. బీజేపీ ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఆంధ్రా బ్యాంక్ విలీనానికి కమ్యూనిస్టు పార్టీలు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.
ఏపీకి బీజేపీ ద్రోహం..
బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏపీకి ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని సీపీఎం, సీపీఐలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.
నిరంకుశ విధానాలు మానుకోవాలి..
వైఎస్సార్ జిల్లా: ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కడప నగరంలోని ఏడు రోడ్లు సర్కిల్‌లో ఆంధ్రా బ్యాంక్ ఎదుట సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. తెలుగు ప్రజల పట్ల ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ విధానాలు మానుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment