పెద్ద నోట్ల రద్దు పేదలకు కష్టాలు తెచ్చిపెట్టిందే తప్ప డబ్బున్న పెద్దోళ్లను కాదని లెఫ్ట్ పార్టీలు ధ్వజమెత్తాయి.
ప్రధాని మోదీ తీరుపై వామపక్షాల ఆగ్రహం
సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు పేదలకు కష్టాలు తెచ్చిపెట్టిందే తప్ప డబ్బున్న పెద్దోళ్లను కాదని లెఫ్ట్ పార్టీలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 55 వేల మంది నల్లధన కుబేరులు హాయిగా ఉన్నారని పేర్కొన్నాయి. 48 గంటల తర్వాత నగదు లావాదేవీలన్నీ సాధారణ స్థితికి వస్తాయని ఈనెల 8న ప్రకటించిన ప్రధాని మోదీ.. ఇపుడు మాటమార్చి మరో 50 రోజులు కష్టాలుంటాయని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించాయి.
మోదీ తీరును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిర్ణరుుంచాయి. ఈమేరకు ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.