రిషికేశ్‌లో ఎన్నికల ర్యాలీలో ఢమరుకం మోగిస్తున్న ప్రధాని మోదీ
రిషికేశ్/జైపూర్: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఉగ్రవాదులు చావుదెబ్బ తిన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ముష్కర మూకలను మన భద్రతా దళాలు వారి సొంత గడ్డపైనే మట్టుబెట్టాయని పేర్కొన్నారు. ఫీర్ ఏక్ భార్ మోదీ సర్కారు(మరోసారి మోదీ ప్రభుత్వం) అనే నినాదం దేశమంతటా ప్రతిధ్వనిస్తోందని అన్నారు. స్థిరమైన ప్రభుత్వం వల్ల కలిగే లాభాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు.
గురువారం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో, రాజస్తాన్‌లోని కరౌలీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కేంద్రంలో బలహీన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉగ్రవాదులు చెలరేగిపోయారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక తోక ముడిచారని వ్యాఖ్యానించారు. దేశాన్ని లూటీ చేయకుండా అవినీతిపరులను అడ్డుకున్నానని, అందుకే వారంతా తనను దూషిస్తున్నారని ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment