సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. అయినప్పటికీ అధికార బీఆర్‌ఎస్ – వామపక్షాల పొత్తు అంశం మాత్రం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశమవుతోంది. ఆ పార్టీల నేతలు పోటీలు పడుతూ దీన్ని తెరపైకి తెస్తున్నారు. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని, ఈ అవగాహనలో భాగంగా తాము అడిగే మొదటి స్థానం పాలేరేనని, ఇక్కడ తాము పోటీ చేస్తే మంచోళ్లంతా తమకే ఓట్లు వేయాలని ఆయన కోరారు. పొత్తు చర్చలు ప్రారంభం కాకుండానే ఆయన సీపీఎం పోటీ చేసే స్థానాలపై మాట్లాడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఓ సభలో కూడా ఇక్కడి నుంచి సీపీఎం కచ్చితంగా పోటీ చేస్తుందంటూ తమ్మినేని చెప్పుకొచ్చారు.
తమ్మినేని మాత్రమే కాదు.. తాము కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న అసెంబ్లీ స్థానాల పరిధిలోని సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఆయా సందర్భాల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు, తాము పోటీ చేసే నియోజకవర్గాలను ప్రస్తావిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని, కొత్తగూడెం నుంచి తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని పార్టీ కేడర్‌కు చెపుతున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్‌ఎస్ ఆలోచన ఏ విధంగా ఉందన్నది బయటపడక పోవడంతో.. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీల మధ్య ఏర్పడిన స్నేహ బంధం ఎంత దూరం కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
గౌరవప్రదమైన స్థాయిలో అంగీకారం!
వామపక్ష పార్టీల్లో జరుగుతున్న చర్చల ప్రకారం.. బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు అడగాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. పాలేరు, వైరా, మధిర, భద్రాచలం, ఖమ్మం, నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ, ఇబ్రహీంపట్నం స్థానాలు కావాలని సీపీఎం అడిగే అవకాశం ఉండగా కొత్తగూడెం, దేవరకొండ, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, ఇల్లందు, మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరే అవకాశముంది. అయితే కోరినన్ని స్థానాలు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో పొత్తును అంగీకరించే యోచనలో రెండు పార్టీలూ ఉన్నట్టు సమాచారం. కనీసం మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యత్వం కోసం బీఆర్‌ఎస్‌ను కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.
బీఆర్‌ఎస్ పెద్దల మదిలో ఏముందో?
కామ్రేడ్ల ఆలోచనలు ఎలా ఉన్నా.. వారితో తమ అనుబంధంపై బీఆర్‌ఎస్ పెద్దల మదిలో ఏముందన్నది అంతు పట్టడం లేదు. పలు సందర్భాల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం తెరపైకి వస్తున్నప్పటికీ ఆ పార్టీ కీలక నేతలెవరూ ఎక్కడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. సీఎం కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాన్ని కనీస మాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు. అయితే వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇప్పిస్తామని, ఆయా స్థానాల్లో తామే పోటీ చేస్తామని స్థానికంగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వామపక్ష పార్టీల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అంశం కూడా ఎక్కడా చర్చకు రావడం లేదు.
ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం!
వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్‌ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా?
లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తారనే సంకేతాల నేపథ్యంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్‌ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. పలువురు కమ్యూనిస్టు నాయకులకు ఏకంగా సీఎం కేసీఆర్ స్థాయిలో హామీ లభించిందన్న ప్రచారం కూడా వారికి మింగుడు పడడం లేదు. అందులో భాగంగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తదితరులు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.
ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం!
వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్‌ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా?
లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఒకవేళ ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్‌ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యా లగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment