
సాక్షి, నెల్లూరు : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో గురువారం బంద్ కొనసాగుతోంది. ఏపీ బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బంద్‌కు సంఘీభావంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేశారు. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్‌పేట మండలం దుండిగం క్రాస్ జోలగుంటపల్లి శివారు వద్ద బంద్‌లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వైఎస్ జగన్ ప్లకార్డులు పట్టుకుని బంద్‌కు సంఘీభావం తెలిపారు. కాగా ఏపీలోని పదమూడు జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment