
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న వామపక్షాలు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాడిపత్రి గెర్దావ్ ఫ్యాక్టరీ ఘటనకు జేసీ నైతిక బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో వామపక్షాలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment