అనంతలో వామపక్షాల ధర్నా
Published Tue, May 16 2017 1:47 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురం: రాయలసీమను పీడిస్తున‍్న కరువు, రైతు సమస‍్యలపై వామపక్షాలు పోరుబాట పట్టాయి. మంగళవారం ఉదయం అనంతపురం కలెక‍్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల ఆందోళనను ప్రారంభించాయి. ఈ కార‍్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితర నేతలు, కార‍్యకర‍్తలు పాల్గొన్నారు. రాయలసీమ బైఠాయింపు పేరిట జరుగుతున‍్న ఆందోళనకు భారీ సంఖ‍్యలో రైతులు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర‍్బంగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీలో రైతు సమస్యలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించటం దుర్మార్గమని మండిపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతు సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నారని ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement