సాక్షి, హైదరాబాద్: ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంతో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిందని దీంతో వామపక్షాలపై ప్రజలకు నమ్మకం పోయిం దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒకటేనని అందుకే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)గా ప్రజల ముందుకు సీపీఎం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో సీపీఎం 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.
మిగతా స్థానాల్లో బీఎల్‌ఎఫ్ అభ్య ర్థులు పోటీలో ఉంటారన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 14 కులదురహంకార హత్యలు జరిగాయని, ఈ హత్యలను టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ కులదురహం కార హత్యలపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నాయిని ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
ఈ హత్యలకు నిరసనగా ఈ నెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రణయ్ హత్య లో ఆరోపణలెదుర్కొంటున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర రాజకీయనేతల పాత్రపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న 20నుంచి 25 మందితో బీఎల్‌ఎఫ్ మొదటి జాబితాను ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment