కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్ర బంద్‌కు సర్వం సిద్ధమైంది. బంద్‌కు అన్ని సన్నాహాలు చేసినట్టు వామపక్ష పార్టీలు ప్రకటించాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు తెలిపాయి.