
ప్రధాని బూట్ల దుమ్ము తుడుస్తున్న బాబు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఉభయకమ్యూనిస్టు పార్టీలు మండిపడ్డాయి.
వామపక్షాల మండిపాటు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఉభయకమ్యూనిస్టు పార్టీలు మండిపడ్డాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని అన్ని హామీలు అమలవుతాయని పొత్తు పెట్టుకున్నామన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీ లు అమలవకపోతున్నా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డాయి. ఇప్పుడు ప్రధాని బూట్ల మీద దుమ్ము తుడిచే పనిలో చంద్రబాబు ఉన్నారని ఘాటుగా విమర్శించాయి.
తిరుపతిలో ప్రారంభమైన వామపక్షాల బస్సు యాత్ర కర్నూలులో శనివారం ముగిసింది. తమ పోరాటం కర్నూలు నుంచే ప్రారంభం అవుతుందని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. బహిరంగసభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రసంగించారు.