చంద్రబాబు ప్రభుత్వం తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిసారి రాజీపడేలా వ్యవహరించిందని తెలిపారు. విభజన హామీల విషయంలో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయలేదని గుర్తుచేశారు.