జాతీయస్థాయిలోనూ లాల్‌–నీల్‌? | Lal-Neal also into the National Level | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలోనూ లాల్‌–నీల్‌?

Published Mon, Mar 27 2017 12:24 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

Lal-Neal also into the National Level

కార్యాచరణ దిశగా సీపీఎం అడుగులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేస్తున్న లాల్‌–నీల్‌ ప్రయోగాన్ని సీపీఎం దేశవ్యాప్తంగా అమలుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక శక్తుల సమస్యలను వామపక్షాలు నిర్లక్ష్యం చేశాయన్న విమర్శలను దూరం చేసుకునేందుకు జాతీయస్థాయిలో ఉమ్మడి కార్యాచరణను ఆ పార్టీ చేపట్టనుంది. పార్టీ పటిష్టత, విస్తరణకోసం సీపీఎంతో కలసి వచ్చే ప్రజాతంత్ర శక్తులు, సామాజిక శక్తులు, సంస్థలతో కలసి పని చేయనుంది.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి నినాదంతో ఆ పార్టీ చేపట్టిన పాదయాత్ర అనుభవాలు, భవిష్యత్తు కార్యాచరణపై మార్చి 31 నుంచి ఏప్రిల్‌1 వరకు రెండు రోజులపాటు ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సైతం హాజరుకానుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement