18 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు | Kanipakam Brahmotsavam from 18 | Sakshi
Sakshi News home page

18 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు

Published Sun, Sep 10 2023 4:39 AM | Last Updated on Sun, Sep 10 2023 4:39 AM

Kanipakam Brahmotsavam from 18 - Sakshi

యాదమరి(చిత్తూరు జిల్లా): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నా యి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధి­కారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మో­­త్సవాలను పురస్కరించుకుని సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారు నిత్యం వివిధ వా­హన సేవల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నా­రు. వినాయక చవితి మరుసటి రోజు ధ్వజా­­రోహణం నిర్వహించనున్నారు.

ఆ తర్వా­త హంస వాహన సేవ, మయూర వాహన సేవ, మూషి­క వాహన  సేవ, చిన్న, పెద్ద శేష వాహన సేవ, వృషభ వాహన సేవ, గజవాహ­న సేవ, రథోత్సవం, అశ్వవాహన సేవ, ఏకాంత సేవ­లు తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు మాట్లాడుతూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఆలయ పరిసరాలు, అనుబంధ ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అన్న­ప్రసాదా­ల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించామన్నా­రు. స్వామివారి దర్శనార్థం వ­చ్చే భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement