వినాయక చవితి స్పెషల్‌: కేసి మిథోయ్‌  | Ganesh Chaturthi Special Kesi Mithai Recipe In Telugu | Sakshi
Sakshi News home page

వినాయక చవితి స్పెషల్‌: కేసి మిథోయ్‌ 

Published Mon, Sep 18 2023 1:17 PM | Last Updated on Mon, Sep 18 2023 1:39 PM

Ganesh Chaturthi Special Kesi Mithai Recipe In Telugu - Sakshi

కేసి మిథోయ్‌

కావలసినవి: తాజా బియ్యప్పిండి – రెండు కప్పులు; పచ్చికొబ్బరి తురుము – కప్పు;
పంచదార పొడి – అరకప్పు; యాలకుల పొడి అరటీస్పూను; కొబ్బరి నీళ్లు – అరకప్పు.

తయారీ:
తడి బియ్యప్పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ∙దీనిలో కొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల ΄పొడి వేసి కలపాలి.
 అవసరాన్ని బట్టి కొబ్బరి నీళ్లను కొద్దికొద్దిగా వేసి పిండిని ముద్దలా కలుపుకోవాలి.
► పిండి ముద్దను చిన్న భాగాలుగా చేసి, ఉండలుగా చుట్టుకోవాలి ∙పిండిమొత్తాన్ని ఉండలుగా చుట్టుకుంటే కేసి మిథాయ్‌ రెడీ.
► కొబ్బరి నీళ్లకు బదులు కొద్దిగా నెయ్యికూడా కలుపుకోవచ్చు ∙రిఫ్రిజిరేటర్లో రెండుమూడురోజుల వరకు ఇవి తాజాగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement