
సాక్షి, విజయవాడ: వినాయక చవితి పండగపై టీడీపీ, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయి అని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఇక్కడ కూడా అవే అమలు చేస్తున్నాం అని కొడాలి నాని తెలిపారు. ఏపీలో అడ్రస్ లేని బీజేపీ రాజకీయం చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోంది అంటూ కొడాలి నాని మండి పడ్డారు. (చదవండి: పని కట్టుకుని ఇన్ని అబద్ధాలా?)
సోము వీర్రాజుకి విగ్రహాలతోనూ వినాయక చవితితోను రాజకీయం చేయడం అలవాటే అన్నారు కొడాలి నాని. తుప్పు చంద్రబాబు.. పప్పు లోకేశులు వినాయక చవితిపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్ళిద్దరికీ శవం ఎక్కడ దొరుకుతుందో అని ఎదురుచూస్తున్నారు.. కరోనాతో ప్రజలకి ఇబ్బంది వస్తే రాజకీయం చేయడం కోసం ఇప్పుడు ఈ డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారు అని కొడాలి నాని స్పష్టం చేశారు.
చదవండి: ఉన్నది ఉన్నట్లుగా రాయండి
Comments
Please login to add a commentAdd a comment