వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరి జీవితాల్లో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుంచి ఆ విఘ్నేశ్వరుడు త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు. (బ్రహ్మీ మట్టి గణపతి.. ఫ్యాన్స్ ఖుషీ)
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులు వినాయక చవితి విషెస్ తెలిపారు. ‘మీ అందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు. కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచమంతా ఇబ్బంది పడుతోంది. అందుకు అనుగుణంగా అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేశుని విగ్రహాలను పూజించండి. సామాజిక సమావేశాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించాలి’ అని ట్వీట్ చేశారు. (చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్)
వినాయక చవితితో పాటు ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన పుట్టిన రోజున విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
అందరి జీవితాల్లోంచి అడ్డంకులను తొలగించి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని అక్కినేని సమంత పేర్కొన్నారు. ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా సకల విఘ్నాలు తొలిగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ట్వీట్ చేశారు. అయితే ప్రతి ఒక్కరూ కరోనా పరిస్థితులు చక్కబడేంత వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించి.. సామాజిక దూరం పాటించాలని కోరారు.
ఈ క్రమంలో హీరో నితిన్ ఇంట్లో వినాయక పూజ నిర్వహించుకున్న ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ ఏడాది నితిన్.. శాలినిని వివాహం చేసుకొని ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. పెళ్లి అయ్యాక మొదటి పండగ అవ్వడంతో ఇంట్లో సతీసమేతంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment