
బొరివంకలో ఉద్దానం యూత్‌క్లబ్ సిద్ధం చేసిన నారికేళసుమాలబాలగణపతి విగ్రహం
శ్రీకాకుళం,కవిటి: కవిటి మండలం బొరివంక కేంద్రంగా ఉన్న ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలకు వినూత్నరీతిలో నారికేళసుమాలబాల గణపతి నయనానందకరంగా సిద్ధం చేశారు. యూత్‌క్లబ్‌కు చెందిన శిల్పి భైరి తిరుపతి ఉద్దానం ప్రధాన పంట అయిన కొబ్బరి ఉత్పత్తులతో వినూత్నంగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు.పర్యావరణానికి పెద్దపీటవేస్తూ ఎటువంటి రసాయనాల వినియోగం లేకుండా బొమ్మను రూపొందించారు.
2014వ సంవత్సరంలో వరినారుతో చేసిన గణపతి విగ్రహానికి ఇండియన్‌బుక్‌ఆఫ్ రికార్డ్స్‌అవార్డు, 2015లో తయారుచేసిన ఆయుర్వేద మూలికలతో చేసిన గణపతికి లిమ్కాబుక్‌ఆఫ్‌రికార్డ్స్ అవార్డు, 2017లోచేసిన గోధుమనారు గణపతికి హైరేంజ్‌బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కింది. ఈ ఏడాది వినూత్నంగా కొబ్బరిపువ్వు, కొబ్బరిపీచుత్రాడు, తదితర పదార్ధాలతో దీనిని సర్వాంగసుందరంగా శిల్పి తిరుపతిరావు తీర్చిదిద్దాడు. గతంలో పామాయిల్‌కాయలతో కూడాగణపతి విగ్రహం తయారుచేశాడు.