సింగపూర్‌లో వినాయక చవితి సంబరాలు | Vinayaka chavithi pooja held in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో వినాయక చవితి సంబరాలు

Published Tue, Aug 25 2020 6:29 PM | Last Updated on Tue, Aug 25 2020 6:34 PM

Vinayaka chavithi pooja held in Singapore - Sakshi

సింగపూర్‌ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శివన్ టెంపుల్‌లో వినాయక చవితి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ -19 నిబంధనలకి అనుగుణంగా అన్ని నియమాలను పాటిస్తూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మంది బాలబాలికలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని, పూజా ద్రవ్యాలను అందించామన్నారు. అలాగే  కోవిడ్ -19 కారణంగా పరోక్షంగా పాల్గొనే అవకాశం కల్పించామని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు రవి సోమా మాట్లాడుతూ అందరికి ఆ వినాయకుని ఆశీస్సులు అందాలనే ఉద్దేశ్యంతో పూజా కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ప్రసారం చేశామన్నారు. అందరి మంచికోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కార్యవర్గసభ్యులకు, దాతలకు, పూజాకార్యక్రమంలో పాల్గొన్నవారికి, పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement