ssj
-
సింగపూర్‌లో వినాయక చవితి సంబరాలు
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శివన్ టెంపుల్లో వినాయక చవితి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ -19 నిబంధనలకి అనుగుణంగా అన్ని నియమాలను పాటిస్తూ ఆన్లైన్లో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని, పూజా ద్రవ్యాలను అందించామన్నారు. అలాగే కోవిడ్ -19 కారణంగా పరోక్షంగా పాల్గొనే అవకాశం కల్పించామని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు రవి సోమా మాట్లాడుతూ అందరికి ఆ వినాయకుని ఆశీస్సులు అందాలనే ఉద్దేశ్యంతో పూజా కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రసారం చేశామన్నారు. అందరి మంచికోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కార్యవర్గసభ్యులకు, దాతలకు, పూజాకార్యక్రమంలో పాల్గొన్నవారికి, పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. -
‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : ఏడాది పీజీ డిప్లమా కోర్స్ (2019–20) కోసం సాక్షి జర్నలిజం స్కూల్ నిర్వహించిన ప్రవేశ పరీక్ష, బృందచర్చ , మౌఖిక పరీక్షల అనంతరం తుది ఫలితాలను సోమవారం విడుదల చేశారు. హాల్ టెకెట్ నంబరు ఆధారంగా అక్కడే అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపికైనవారు ఆగస్టు 1న (గురువారం) సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ఉదయం 9.30 గంటలకు జరిగే కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని స్కూల్ ప్రిన్సిపల్ ఆర్. దిలీప్‌రెడ్డి తెలిపారు.(కాల్ లెటర్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి) ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లు 110020 130114 130273 130394 170057 210021 250012 280004 110030 130120 130277 150013 170091 220005 250015 280019 110040 130121 130278 150033 190005 230010 250022 290003 110042 130145 130342 150048 190007 230011 250030 290026 120014 130191 130359 150049 200014 240011 250031 290030 120023 130211 130364 150071 200037 240012 250032 300002 120048 130242 130368 150073 200067 240023 250042 310000 130016 130245 130378 150078 200071 240029 260006 310031 130060 130246 130384 160002 210010 250000 260007 310068 130093 130262 130387 170051 210020 250007 270000 -
ఎస్‌ఎస్‌జేలో జర్నలిజం కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
చరిత్ర రచనలో సాక్షిగా నిలవండి కొత్త చరిత్రను మీరే లిఖించండి. పాత్రికేయం అంటే మామూలు ఉద్యోగం కాదు, అదొక యజ్ఞం. నిజాల నిగ్గు తేల్చుతూ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం. మీలో ఆ నిబద్ధత ఉంటే మేము ముందుకు నడిపిస్తాం. ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం’ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. సమాజంలో గౌరవం, కీర్తితో పాటు ఉపకారవేతనం కూడా సంపాందించండి. పత్రికలు, ప్రసార మాధ్యమాలకు సుశిక్షితులైన జర్నలిస్టులను అందించే లక్ష్యంతో ఏడాది వ్యవధి కలిగిన ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం’ కోర్సును సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం అందిస్తోంది. (ఈ కోర్సు సాక్షి మీడియా స్వయం ప్రతిపత్తితో నిర్వహిస్తోంది. ప్రభుత్వ నియంత్రణలోని ఏ ఇతర విద్యాసంస్థతోనూ ఎటువంటి సంబంధం లేదు.) రిపోర్టింగ్, రైటింగ్, ఎడిటింగ్, డిజైనింగ్, స్కిప్ట్రింగ్, ప్రోగ్రామింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఆయా రంగల్లో తీర్చిదిద్దుతాము. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫుల్లీ ఫంక్షనల్ న్యూస్ రూం, టి.వి స్టూడియో వంటి సౌకర్యాల మధ్య విద్యాభ్యాసం చేసే అవకాశం వల్ల ప్రింట్ పబ్లిషింగ్, ఆన్ లైన్ కంటెంట్, టీవీ ప్రోగ్రామింగ్ విభాగాల్లో చక్కటి అనుభవం లభిస్తుంది. తరగతి గదుల్లో ఇచ్చే శిక్షణతో పాటు న్యూస్ రూముల్లో ఇచ్చే శిక్షణతో మరింత మెరుగుపడతారు. దరఖాస్తులు : www.sakshischoolofjournalism.com, www.sakshieducation.com వెబ్సైట్లలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో అన్ని విధాలా దరఖాస్తు పూర్తి చేయవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడే రూ. 250 ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత ఒక యూనిక్ నెంబరు వస్తుంది. ఆ నెంబరును దరఖాస్తుపై పేర్కొంటూ, పూర్తి చేసి ఆన్లైన్లోనే సమర్పించిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లభిస్తుంది. దాన్ని ఉపయోగించి జూన్ 4వ తేదీ 2019 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రెండు దశల ఎంపిక : విద్యార్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్లో తెలుగు, ఇంగ్లిష్ , కరెంటు అఫైర్స్ అంశాల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్లో వ్యాసరూప, ఆంగ్లం నుంచి తెలుగులో అనువదించే ప్రశ్నలుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సాక్షి పబ్లికేషన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మోడల్ పేపర్లు www.sakshischoolofjournalism.com, www.sakshieducation.com వెబ్ సైట్లలో లభిస్తాయి. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెండో దశలో గ్రూప్ డిస్కషన్, మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో కూడా ఉత్తీర్ణులైన విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు. అగ్రిమెంట్ : ఎంపికైన అభ్యర్థులు 4 ఏళ్ల పాటు (శిక్షణ సమయం కలుపుకొని) సాక్షిలో పని చేయాలి. ఆరంభంలోనే ఒప్పందపత్రం ఇవ్వాలి. అభ్యర్థులు సాక్షికి సంబంధించిన ఏ విభాగంలోనైనా లేదా ఫీల్డ్‌లోనైనా, లేదా ఎక్కడ కేటాయిస్తే అక్కడ పని చేయవలసి ఉంటుంది. నెలసరి ఉపకారవేతనం : మొదటి 6 నెలలు : రూ 10,000/– తదుపరి 6 నెలలు : రూ 12,000/– ట్రైనీగా ఏడాది పాటు : రూ 15,000/– కనీస అర్హతలు : తెలుగు భాషలో ప్రావీణ్యం ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం – గ్రాడ్యుయేషన్ పట్టా వయోపరిమితి : 09–06–2019 నాటికి 30 ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి. ముఖ్య తేదీలు : దరఖాస్తు చేయడానికి చివరి తేది : మే 28 (మంగళవారం) రాతపరీక్ష : జూన్ 9 (ఆదివారం) రాతపరీక్ష ఫలితాలు : జూన్ 24 (సోమవారం) ఇంటర్వ్యూలు : జులై 8 నుంచి 13 వరకు తుది ఫలితాలు : జులై 22 (సోమవారం) తరగతుల నిర్వహణ : జులై 29 (సోమవారం) నుంచి... చిరునామ : ప్రిన్సిపాల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, 6వ అంతస్తు, ఎం.జి.ఆర్.ఎస్టేట్స్, మోడల్ హౌస్ వెనుక, పంజగుట్ట, హైదరాబాద్ – 500082. ఫోన్ : 040 2335 4715, సమయం : ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు (ఆదివారం సెలవు) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కింది లింక్‌ను క్లిక్ చేయండి. www.sakshischoolofjournalism.com -
‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : సాక్షి జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ బుధవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను కింద పేర్కొన్న వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అలాగే, ఎంపికైన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి అడ్మిషన్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలి. కోర్సు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న వివరాలను త్వరలోనే వెబ్సైట్ ద్వారా తెలియజేయడంతో పాటు అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ ద్వారా కూడా సమాచారం ఇస్తారు. పూర్తి వివరాలను ఈ కింద లింక్ క్లిక్ చేయండి http://www.sakshieducation.com/jschool/index.aspx -
ఎస్ఎస్జే ప్రవేశ పరీక్ష ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: జర్నలిజం పీజీ డిప్లొమో కోర్సు కోసం సాక్షి జర్నలిజం స్కూలు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుంచి 1452 మంది దరఖాస్తు చేసుకోగా 1212 మంది అభ్యర్థులు హాజరయినట్లు స్కూలు ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 13 సెంటర్లు, తెలంగాణలో హైదరాబాద్‌తో సహా 8 సెంటర్లలో ఈ పరీక్షలు జరిగాయని వివరించారు. పేపరు-1కు సంబంధించి సమాధానాల ‘కీ’ ఈ నెల 8 నుంచి sakshi school of journalism.com, sakshi education.com, sakshi.com వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు. -
నేడు ‘సాక్షి ఎరీనా వన్’ అంబాసిడర్ల మీట్
సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఎరీనా వన్’ కార్యక్రమానికి అంబాసిడర్లుగా వ్యవహరించేందుకు వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని సాక్షి జర్నలిజం స్కూల్లో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఏ సమయానికి హాజరుకావాలన్న విషయాన్ని ఆ అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ రూపంలో వారికి తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9666284600, 9705199924లో సంప్రదించవచ్చు. -
సాక్షి జర్నలిజం స్కూలు కొత్త బ్యాచ్ ప్రారంభం