ఎస్‌ఎస్‌జే ప్రవేశ పరీక్ష ప్రశాంతం
Published Sun, Mar 5 2017 7:27 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM
సాక్షి, హైదరాబాద్: జర్నలిజం పీజీ డిప్లొమో కోర్సు కోసం సాక్షి జర్నలిజం స్కూలు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుంచి 1452 మంది దరఖాస్తు చేసుకోగా 1212 మంది అభ్యర్థులు హాజరయినట్లు స్కూలు ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో 13 సెంటర్లు, తెలంగాణలో హైదరాబాద్‌తో సహా 8 సెంటర్లలో ఈ పరీక్షలు జరిగాయని వివరించారు. పేపరు-1కు సంబంధించి సమాధానాల ‘కీ’ ఈ నెల 8 నుంచి sakshi school of journalism.com, sakshi education.com, sakshi.com వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుందని ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement