
న్యూఢిల్లీ: వినాయక చవితి వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వినాయక చవితి ఉత్సవాలపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గణేశ్ చతుర్థికి(సెప్టెంబర్ 10) మరో రెండు రోజులు మాత్రమే సమయమున్న నేపథ్యంలో డిల్లీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
బహిరంగ మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయకుండా జిల్లా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే సామూహిక ప్రదేశాలలో జనాలు భారీగా గుమిగూడకుండా చూడాలని పేర్కొంది. గణేశుడి ఊరేగింపులకు కూడా అనుమతి లేదని ఉత్తర్వులో పేర్కొంది. ప్రజలు ఇంట్లో పండుగను జరుపుకోవాలని డీడీఎంఏ సూచించింది.
చదవండి: కోతుల గుంపు దాడి.. భయాందోళనతో బీజేపీ నాయకుడి భార్య మృతి
బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు పేలుడు
Comments
Please login to add a commentAdd a comment