
హైదరాబాద్ మహా నగరాన్ని చేరుకోవడం ఒక ఎతైతే అక్కడి నుండి ఖైరతాబాద్ గణేషుడిని చేరుకోవడం మరో పెద్ద సమస్య
వినాయక చవితి పండగ వచ్చిందంటే ప్రతి గల్లీలు జైబోలో గణేష్ మహరాజ్ కీ... అంటూ మారుమోగిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో సందడి ఇంతా అంతా ఉండదు. అందులోనూ హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో విశిష్టత ఉంది. ఈ గణనాధుడిని దర్శించుకుంటే లోకకల్యాణం జరుగుతుందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ప్రజల ఒక విశ్వాసం. ఎంతో వ్యయప్రయాలకోర్చి హైదరాబాద్ మహా నగరాన్ని చేరుకోవడం ఒక ఎతైతే అక్కడి నుండి ఖైరతాబాద్ గణేషుడిని చేరుకోవడం మరో పెద్ద సమస్య. నగరంలో రోజురోజుకు పెరిగిన ట్రాఫిక్ ప్రజలను చికాకుల్లోకి నెడుతుంటుంది. రెండు మూడు బస్సులు ఎక్కి దిగుతూ చాలా కష్టం మీద గౌరీపుత్రుడి దర్శనం చేసుకునేవారు. ఈసారి ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. వివరాలు వీడియోలో చూడండి.