గణపతి నవరాత్రుల సందర్భంగా తాము ప్రతిష్టించే వినాయక విగ్రహాలు అందరి దృష్టిని ఆకర్షించాలని భక్తులు కోరుకుంటారు. అయితే మహారాష్ట్ర, పూణెలోని శంకర్‌నగర్‌కు చెందిన గణేష్ భక్తులు మాత్రం విగ్రహా ఏర్పాటులో సాంకేతికతను వినియోగించారు. నూతనంగా ఆలోచించిన వారు.. ఏటీఎమ్(ఎనీ టైమ్ మోదక్) వినాయకున్ని ఏర్పాటు చేశారు. మోదక్ అంటే వినాయకునికి ఇష్టమైన ప్రసాదం.