
సాక్షి, చెన్నై: ‘విరుమన్’ చిత్రం వినాయక చవితికి విడుదలకు ముస్తాబవుతోంది. కార్తీ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ముత్తయ్య దర్శకత్వంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
నటుడు రాజ్‌కిరణ్, ప్రకాష్‌రాజ్, సూరి, ఆర్‌కే సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాగా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ஆகஸ்ட் 31 விநாயகர் சதுர்த்திக்கு வர்றோம் #விருமன் #VirumanFromAug31@Karthi_Offl @Suriya_offl @2D_ENTPVTLTD @dir_muthaiya @thisisysr @AditiShankarofl @rajsekarpandian @prakashraaj #Rajkiran @sooriofficial @sakthivelan_b pic.twitter.com/qnr2X1NKKT
— Actor Karthi (@Karthi_Offl) May 18, 2022
Comments
Please login to add a commentAdd a comment