హాస్య బ్రహ్మగా టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు కమెడియన్ బ్రహ్మానందం. ఆయన లేనిదే సినిమాలో కామెడీ లేదు అనేంత పేరును సంపాదించారు. బ్రహ్మానందం అంటే ఒక ట్రెండ్ సెట్ అనే చెప్పవచ్చు. రెండు దశాబ్దాలకుపైగా వెండితెరపై తనదైన శైలిలో కామెడీని పండించి సినిమాలకు ఒక స్పెషల్ క్రేజ్‌ను అందించారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ఓ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఈ మధ్య సినిమాల్లో నటించడం బ్రహ్మనందం తగ్గించేశారు. దీంతో ఇటీవల కాలంలో ఆయన గురించి మాట్లాడుకోవడం తగ్గిపోయింది. (ఆంజనేయుని ఆనందబాష్పాలు)
ఈ క్రమంలో తాజాగా ఆయన వార్తల్లో నిలిచారు. శనివారం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని బ్రహ్మనందం తయారు చేశారు. తమ స్వగృహంలో తన చేతితో మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే పర్యావరణానికి హానీ కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే వీటిని ముందుగా ఎవరూ పోస్టు చేయారో తెలియదు కానీ.. బ్రహ్మీ అభిమానులు తమ ట్విటర్‌లో షేర్ చేసేస్తున్నారు.. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘బాలీవుడ్ కంటే సౌత్ యాక్టర్స్ బెటర్.. సాంప్రదాయలకు, పండగలకు విలువిచ్చే వ్యక్తి అని కొనియాడుతున్నారు. రియల్ యాక్టర్ బ్రహ్మనందం. బ్రహ్మ ద క్రియేటర్’ అంటూ పొగిడేస్తున్నారు. (ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ)
Comments
Please login to add a commentAdd a comment