సాక్షి, న్యూఢిల్లీ: వినాయక చవితి ఉత్సవాలు బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు గణపయ్య పూజలు అందుకోనున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లారు. అక్కడ తొలిరోజు గౌరీ తనయుడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణేష్ చతుర్థి సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతంలోని ఓ శ్లోకాన్ని సైతం ఆయన షేర్ చేశారు.
రాష్ట్రపతి శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాక్షించారు. జ్ఞానానికి ప్రతీక అయిన మంగళమూర్తి గణేషుడు అందరికీ మంచి చేయాలని కోరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘గణపతిబప్పా మోరియా’ అంటూ ట్వీట్ చేశారు. ఆగస్టు 31 మొదలైన లంబోదరుడి ఉత్సవాలు సెప్టెంబర్ 9న ముగియనున్నాయి. గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల నడుమ కొనసాగిన గణనాథుడి వేడుకలు ఈసారి పునర్‌వైభవం సంతరించుకోనున్నాయి.
(చదవండి: కిడ్నాప్ కేసులో ఆరోపణలు.. శాఖ మార్చిన కాసేపటికే బిహార్ మంత్రి రాజీనామా)
Comments
Please login to add a commentAdd a comment