
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితికి నాలుగు రోజుల ముందే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ చరిత్రలోనే ఇది మొదటిసారి. శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి పనులు పూర్తికావడంతో నిర్వాహకులు ఆదివారం కర్రలను పూర్తిగా తొలగించారు. ఏటా వినాయక చవితికి ఒక రోజు ముందు కర్రలు తొలగిస్తారు. కానీ.. ఈసారి నాలుగు రోజుల ముందే వీటిని పూర్తిగా తొలగించారు.
చదవండి: ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ముస్తాబవుతున్న ఖైరతాబాద్