KHAIRATABAD Ganesha
-
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ ముస్తాబు
-
మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి
-
మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితికి నాలుగు రోజుల ముందే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ చరిత్రలోనే ఇది మొదటిసారి. శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి పనులు పూర్తికావడంతో నిర్వాహకులు ఆదివారం కర్రలను పూర్తిగా తొలగించారు. ఏటా వినాయక చవితికి ఒక రోజు ముందు కర్రలు తొలగిస్తారు. కానీ.. ఈసారి నాలుగు రోజుల ముందే వీటిని పూర్తిగా తొలగించారు. చదవండి: ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ముస్తాబవుతున్న ఖైరతాబాద్ -
గణనాథుడికి బైబై
-
ద్వాదశాదిత్యుడు సిద్ధమవుతుండు సిద్ధమవుతుండు
సాక్షి, హైదరాబాద్: : 65 ఏళ్ల ఖైరతాబాద్ చరిత్రలోనే ఈసారి తయారు చేస్తున్న ద్వాదశాదిత్య మహాగణపతిని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఏకంగా 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 12 ముఖాలు, 24 చేతులతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా మూడు నెలల ముందు నుంచే ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు ప్రారంభిస్తారు. విగ్రహ తయారీలో 150 మంది పని చేస్తారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహ తయారీ పనులు ఇప్పటికే 80శాతం పూర్తయ్యాయి. ఈ నెల 27 వరకు పనులన్నీ పూర్తవుతాయి. వీరే పాత్రధారులు... షెడ్డు పనులు: ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్ ఆధ్వర్యంలోని 20 మంది బృందం. వెల్డింగ్ పనులు: మచిలీపట్నంకు చెందిన జి.నాగబాబు ఆధ్వర్యంలోని 20 మంది. క్లే వర్క్: చెన్నైకి చెందిన గురుమూర్తి ఆధ్వర్యంలోని 25 మంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్: మహారాష్ట్రకు చెందిన సుభాష్ ఆధ్వర్యంలోని 23 మంది. మోల్డింగ్ పనులు: హైదరాబాద్‌కు చెందిన కోఠి ఆధ్వర్యంలోని 22 మంది బృందం. ఫినిషింగ్ పనులు: బిహార్, బెంగాల్‌కు చెందిన గోపాల్, సంతోష్‌ల ఆధ్వర్యంలోని 15 మంది. పెయింటింగ్: కాకినాడకు చెందిన భీమేశ్ ఆధ్వర్యంలోని 25 మంది బృందం. విగ్రహం వివరాలివీ... పేరు: ద్వాదశాదిత్య మహాగణపతి తలలు 12 సర్పాలు 12 చేతులు 24 24 చేతుల్లో 24 ఆయుధాలు ఉంటాయి. అవి అభయహస్తం, లడ్డూ, శంఖం, చక్రం, గద, పరశు, పాశం, శూలం, అంకుశం, కత్తి, రుద్రాక్షలు, పుష్పశరం, పద్మం, చెరుకుగడ ధనస్సు, బాణం, నాగం, వీణ, దండం, కమండలం, సుల్లా, గ్రంథం, గొడ్డలి, భగ్న దంతం, ధ్వజం. సామగ్రి, ఖర్చులు ఇలా.. సర్వీ కర్రలు 80 టన్నులు, వ్యయం రూ.3 లక్షలు. షెడ్డు నిర్మాణానికి లేబర్ రూ.లక్ష గోవా తాడు 100 బెండళ్లు, రూ.11 వేలు స్టీల్ 30 టన్నులు, ఖర్చు రూ.20 లక్షలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 45 టన్నులు (మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఉచితంగా అందజేసింది) కొబ్బరి నార 60 బెండళ్లు, రూ.90 వేలు గోనె క్లాల్ 2వేల మీటర్లు, రూ.60 వేలు బంకమట్టి 600 బ్యాగులు, రూ.1.25 లక్షలు ఫ్రెంచ్ పాలిస్ రూ.11 వేలు వాటర్ పెయింట్స్ 120 లీటర్లు, రూ.80 వేలు వెల్డింగ్, మోల్డింగ్, డిజైన్ వర్క్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సెక్యూరిటీ ఇతరత్రా లేబర్ చార్జీలు రూ.35 లక్షలు ప్రతిరోజు లేబర్‌కు భోజనం రూ.10 లక్షలు ట్రాన్స్పోర్ట్, ఇతరత్రా ఖర్చులు రూ.3 లక్షలు 1954లో స్వాతంత్ర సమరయోధుడు సింగరి శంకరయ్య ఒక్క అడుగుతో ప్రారంభించిన ఖైరతాబాద్ గణపతి ఎత్తు ఏటా ఒక అడుగు పెరుగుతూ వస్తోంది. సింగరి శంకరయ్య 1994లో మరణించిగా... ఆయన తమ్ముడు సింగరి సుదర్శన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన బావమరిది సందీప్‌రాజ్, కుమారుడు రాజ్‌కుమార్‌ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నమూనాలో మార్పులు.. మహాగణపతి ప్రధాన తలపై మూడు తలలు ఉండేలా తొలుత శిల్పి నమూనా సిద్ధం చేశారు. అయితే తయారీ సమయంలో 12 తలలను సెట్ చేసేందుకు ప్రధాన తలపై మూడు తలలకు బదులుగా ఐదు తలలను పెట్టి డిజైన్ ఫైనల్ చేశారు. దీంతో నమూనాను రెండుసార్లు మార్చారు. 12 తలలు, 12 సర్పాలు, 24 చేతులతో మహాగణపతిని తయారు చేయాలంటే తప్పనిసరిగా 61 అడుగులు ఉండాలని... ఈ నేపథ్యంలో ఎత్తు పెంచాల్సి వచ్చిందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు. -
ఈసారి ముందుగా ఖైరతాబాద్ గణేశ నిమజ్జనం!
హైదరాబాద్: నగరంలోని ఇతర వినాయక విగ్రహాల నిమజ్జనం కంటే ముందుగానే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగనుంది. బుధవారం హైదరాబాద్‌లో గ్రేటర్ పరిధిలో వినాయక ఉత్సవాలపై సమావేశం జరిగింది. ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం ముందుగానే చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇంతకముందు నగర పరిసర ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలన్నీంటిని నిమజ్జనం చేసిన తరువాత ఎప్పటికోగానీ ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి అలా కాకుండా ఖైరతాబాద్ గణనాథుడిని వచ్చే నెల 15న మధ్యాహ్నం 2 గంటల లోపే నిమజ్జనం చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, ముగ్గురు పోలీసు కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దని సూచించారు. -
ఖైరతాబాద్ లడ్డూ సాగర్‌లో నిమజ్జనం
హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడికి నైవేద్యంగా ఉంచిన లడ్డూను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. వర్షంలో తడిసిన లడ్డూ పాడైపోవడంతో దీన్ని హుస్సేన్ సాగర్‌లో కలిపేశారు. చెడిపోకుండా ఉంటే భక్తులకు పంపిణీ చేయాలని నిర్వాహకులు భావించారు. భక్తుల కూడా మహాగణపతి ప్రసాదం కోసం భారీగా తరలివచ్చారు. లడ్డూ పూర్తిగా పాడైపోయిందని, తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తేల్చారు. దీంతో భక్తులు నిరాశగా వెనుదిరిగారు. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ లంబోదరుడి చేతిలో ఏర్పాటు చేసిన 4200 కిలోల లడ్డూ బుధవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి తడిసింది. దాదాపు మూడు గంటల పాటు వర్షంలో తడవడంతో అది చక్కెర పానకంలా తయారైంది. లడ్డూను దించిన తర్వాత కవర్లతో కప్పి ఉంచడం వల్ల గాలి ఆడక కూడా అది చెడిపోయింది. ఒకవేళ లోపలి భాగం పాడవకుండా ఉంటే భక్తులకు పంపిణీ చేయాలని భావించారు. లడ్డూ మొత్తం పాడైపోవడంతో చేసేది లేక సాగర్‌లో నిమజ్జనం చేశారు. భక్తులకు లడ్డూ పంపిణీ చేయకుండా నిమజ్జనం చేయడం ఖైరతాబాద్ లో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. లడ్డూ పాడవకుండా ఉంటే లక్షా 60 వేల మందికి పంచేవారు. కన్నీళ్లు పెట్టుకున్న మల్లిబాబు లడ్డూ పాడైపోవడంతో దాన్ని తయారుచేయించిన సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే లడ్డూ పాడైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది గణేష్ మాలలు ధరించి వారం రోజుల పాటు కష్టపడి అత్యంత పవిత్రంగా లడ్డూను తయారు చేశారని చెప్పారు. తానెంతో వ్యయప్రయాసలకోర్చి తయారు చేయించిన లడ్డూ భక్తులకు దక్కకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం పూర్తి
-
తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణపతికి 4 వేల కిలోల లడ్డూ
మండపేట, న్యూస్‌లైన్: వినాయక ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో దర్శనమిచ్చే ఇక్కడి గణనాధుని విగ్రహం రాష్ట్రంలోనే ఎత్తైదిగా గణతికెక్కుతుంది. ఇంతభారీ విగ్రహం వద్ద ఉంచే భారీ లడ్డూ తయారీకి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఆధ్వర్యంలో బృందం సిద్ధమైంది. ఖైరతాబాద్‌లో ఈ సంవత్సరం ప్రతిష్టించే 59 అడుగుల ‘గోనాగ చతుర్ముఖ వినాయక’ విగ్రహం చేతిలో 4 వేల కేజీల భారీ లడ్డూను ఉంచనున్నారు. గురువారం మల్లిబాబు విలేకరులతో మాట్లాడుతూ తనతోపాటు, గణేష్‌మాల ధరించిన 16 మంది దీనిని తయారీ చేయనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 4న బూందీ తయారీని ప్రారంభించి 6న లడ్డూను తయారు చేస్తామన్నారు. 7న తుదిమెరుగులు దిద్దుతామని, 8న క్రేన్ సహాయంతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలోకి చేర్చి 9న హైదరాబాద్‌కు చేరుస్తామని వివరించారు.