రామయ్యకు ప్రత్యేక పూజలు | ramaiah ku special poojalu | Sakshi
Sakshi News home page

రామయ్యకు ప్రత్యేక పూజలు

Published Thu, Sep 8 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

 భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్ధ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి, అమ్మవారికి కంకణధారణ గావించి, స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement