గిరినాగే.. ఇలవేల్పు | girinagu poojalu | Sakshi
Sakshi News home page

గిరినాగే.. ఇలవేల్పు

Published Mon, Mar 20 2017 1:16 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

గిరినాగే.. ఇలవేల్పు

గిరినాగే.. ఇలవేల్పు

  • పూజలు చేస్తున్న గిరిజన మహిళ
  • రాజవొమ్మంగి మండలం లాగరాయి శివారున సంఘటన
  • రాజవొమ్మంగి :
    సాధారణంగా గిరినాగు (కింగ్‌కోబ్రా) ఉందంటే చాలామంది భయంతో వణికిపోతారు. ఆ చుట్టుపక్కలకు వెళ్లేందుకే భయపడతారు. 20 మీటర్ల ఎత్తువరకూ పైకి లేచి ఒకేసారి 10, 15 మందిపై దాడి చేసే గిరినాగు గురించి మాట్లాడుకోవడానికే ధైర్యం చాలదు. అలాంటిది ఓ గిరిజన మహిళ తన పూరి గుడిసెలో ఇరుకుగా, చీకటిగా ఉన్న ఓ గదిలోకి ప్రవేశించిన గిరినాగును నాలుగు రోజులుగా పూజిస్తున్న విషయం ఆదివారం వెలుగు చూసింది. 
    ఆరేళ్లుగా నాగదేవత కనిపిస్తుందని..
    రాజవొమ్మంగి మండలం లాగరాయి శివారున ఉన్న జీడిమామిడి తోటలో పూసం సత్యవతి, అబ్బాయిదొర దంపతులు తమ ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. ఏటా ఉగాదికి ముందు తొమ్మిది రోజులపాటు తమ తోటలో ఉంటే పోశమ్మ గుడి వద్ద వసంత రాత్రులు అనే పండగ జరుపుతుంటారు. చివరి రోజున భారీ అన్నసంతర్పణ నిర్వహిస్తారు. పండగ రోజుల్లో ఏదో ఒక రోజు గుడి వద్ద లేదా ఇంట్లో నాగదేవత కనిపించడం ఆరేళ్లుగా జరుగుతుంది. అయితే శుక్రవారం దాదాపు ఎనిమిది మీటర్ల పొడవు మూడు అంగుళాల మందం ఉన్న భారీ సర్పం అందరూ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసింది. అదే గదిలో ప్రతిరోజూ సత్యవతి పూజలు నిర్వహించే పూజా మందిరం ఉంది. ఆ పామును చూసి మొదట భయానికి గురైన కుటుంబసభ్యులు, ఏటా వచ్చే నాగదేవత ఈ భారీ నాగదేవత ఒకటే అని తెలుసుకుని తమ భయాన్ని విడిచి పెట్టారు. నాలుగు రోజులుగా భారీ సర్పం పూజ మందిరంలో ఉండగానే పూజలు నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన చుట్టు పక్కల వారు అధిక సంఖ్యలో ఆ ఇంటికి వచ్చి సర్పరాజుని దర్శించుకుంటున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement