మోతుగూడెం: తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం ఏపీ జెన్‌కో ఫిల్టర్ హౌస్ వద్ద 14 అడుగుల గిరినాగు స్థానికులను బుధవారం హడలెత్తించింది. మంచినీటి ట్యాంక్ వద్ద రెండు రోజుల నుంచి పాము సంచరించడాన్ని జెన్‌కో ఉద్యోగులు గమనించి వన్యప్రాణి విభాగానికి సమాచారమిచ్చారు. వారు నలుగురు స్నేక్ హెల్పర్స్ బృందాన్ని పంపారు. వారు పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాముని అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని అటవీ శాఖ సిబ్బంది చెప్పారు.
చదవండి: పావురంపై ఎఫ్‌ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా?
బంగారు టీషర్ట్! చూశారా..?
Comments
Please login to add a commentAdd a comment