rajavommamgi
-
గిరినాగే.. ఇలవేల్పు
పూజలు చేస్తున్న గిరిజన మహిళ రాజవొమ్మంగి మండలం లాగరాయి శివారున సంఘటన రాజవొమ్మంగి : సాధారణంగా గిరినాగు (కింగ్‌కోబ్రా) ఉందంటే చాలామంది భయంతో వణికిపోతారు. ఆ చుట్టుపక్కలకు వెళ్లేందుకే భయపడతారు. 20 మీటర్ల ఎత్తువరకూ పైకి లేచి ఒకేసారి 10, 15 మందిపై దాడి చేసే గిరినాగు గురించి మాట్లాడుకోవడానికే ధైర్యం చాలదు. అలాంటిది ఓ గిరిజన మహిళ తన పూరి గుడిసెలో ఇరుకుగా, చీకటిగా ఉన్న ఓ గదిలోకి ప్రవేశించిన గిరినాగును నాలుగు రోజులుగా పూజిస్తున్న విషయం ఆదివారం వెలుగు చూసింది. ఆరేళ్లుగా నాగదేవత కనిపిస్తుందని.. రాజవొమ్మంగి మండలం లాగరాయి శివారున ఉన్న జీడిమామిడి తోటలో పూసం సత్యవతి, అబ్బాయిదొర దంపతులు తమ ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. ఏటా ఉగాదికి ముందు తొమ్మిది రోజులపాటు తమ తోటలో ఉంటే పోశమ్మ గుడి వద్ద వసంత రాత్రులు అనే పండగ జరుపుతుంటారు. చివరి రోజున భారీ అన్నసంతర్పణ నిర్వహిస్తారు. పండగ రోజుల్లో ఏదో ఒక రోజు గుడి వద్ద లేదా ఇంట్లో నాగదేవత కనిపించడం ఆరేళ్లుగా జరుగుతుంది. అయితే శుక్రవారం దాదాపు ఎనిమిది మీటర్ల పొడవు మూడు అంగుళాల మందం ఉన్న భారీ సర్పం అందరూ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసింది. అదే గదిలో ప్రతిరోజూ సత్యవతి పూజలు నిర్వహించే పూజా మందిరం ఉంది. ఆ పామును చూసి మొదట భయానికి గురైన కుటుంబసభ్యులు, ఏటా వచ్చే నాగదేవత ఈ భారీ నాగదేవత ఒకటే అని తెలుసుకుని తమ భయాన్ని విడిచి పెట్టారు. నాలుగు రోజులుగా భారీ సర్పం పూజ మందిరంలో ఉండగానే పూజలు నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన చుట్టు పక్కల వారు అధిక సంఖ్యలో ఆ ఇంటికి వచ్చి సర్పరాజుని దర్శించుకుంటున్నారు. -
బాలికపై లైంగిక దాడి
రాజవొమ్మంగి : సైకిల్ నేర్పిస్తానని నమ్మపలికి అడవుల్లోకి తీసుకెళ్ళి 11 ఏళ్ల గిరిజన బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన రాజవొమ్మంగిలో జరిగింది. విషయం తెలిసిన రంపచోడవరం ఏఎస్పీ అద్నా¯ŒS నయీమ్ హష్మి శనివారం రాజవొమ్మంగి వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాధితురాలి ఇంటి పరిసరాలను చూసారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేçÙ¯ŒSలో విలేకరులతో మాట్లాతుతూ ఐదో తరగతి చదువుతున్న బాలికపై అదే వీధికి కూర్మాసుల లోవరాజు (23) అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంకాలం బాలికను సైకిల్ నేర్పిస్తానని నమ్మించి 3 కిలోమీటర్ల దూరంలోని యూకలిప్టస్ వనాల్లోకి తీసుకువెళ్లి సాయంత్రం దాదాపు 5–30 నిముషాలకు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సుమారు 7 గంటలకు ఆ బాలికను ఇంటికి తిరిగి తీసుకువచ్చి ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాలిక విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండగా తల్లి దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా వైద్యాధికారి రవిచంద్ర బాలికను పరీక్షించి అసలు విషయం తెలిపారు. అలాగే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎంఎల్సీ కేసుగా నమోదు చేసి బాలికను అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్పీ అన్నారు. బాలిక తండ్రి గతంలోనే చనిపోగా, పిల్లలు తల్లి సంరక్షణలో వున్నారు. బాలిక అక్క స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతుండగా, తమ్ముడు స్థానిక గిరిజనసంక్షేమ ఆశ్రమపాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఏఎస్పీతో పాటు స్థానిక సీఐ కేఎ¯ŒS. మోహనరెడ్డి, ఎస్సై రవికుమార్, జడ్డంగి ఎస్సై నాగార్జున వున్నారు. -
రాజవొమ్మంగిలో ఆగని శిశు మరణాలు
వెలుగు చూసిన మరో శిశువు మృతి ఐదుకు చేరిన మృతులు రాజవొమ్మంగి మండలంలో శనివారం మరో శిశు మరణం వెలుగు చూసింది. దీంతో ఈ ప్రాంతంలో శిశువుల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మండలంలోని చికిలింత పంచాయతీ దుర్గానగర్‌లో రెండు నెలల పసికందు గురువారం కాకినాడ జీజీహెచ్‌లో మరణించగా శనివారం సాయంకాలం వెలుగు చూసింది. దుర్గానగర్ శివారు చేనుమఖాల్లో నివాసం ఉంటున్న కొచ్చ శ్రీలక్ష్మికి జడ్డంగి పీహెచ్సీలో తొలికాన్పులో మగబిడ్డ పుట్టాడు. మూడు రోజుల కిందట ఆ బిడ్డకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం చేర్పించగా చికిత్సపొందుతూ మరణించాడు. – రాజవొమ్మంగి