బాలికపై లైంగిక దాడి
Published Sat, Jan 7 2017 11:16 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
రాజవొమ్మంగి :
సైకిల్ నేర్పిస్తానని నమ్మపలికి అడవుల్లోకి తీసుకెళ్ళి 11 ఏళ్ల గిరిజన బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన రాజవొమ్మంగిలో జరిగింది. విషయం తెలిసిన రంపచోడవరం ఏఎస్పీ అద్నా¯ŒS నయీమ్ హష్మి శనివారం రాజవొమ్మంగి వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాధితురాలి ఇంటి పరిసరాలను చూసారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేçÙ¯ŒSలో విలేకరులతో మాట్లాతుతూ ఐదో తరగతి చదువుతున్న బాలికపై అదే వీధికి కూర్మాసుల లోవరాజు (23) అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంకాలం బాలికను సైకిల్ నేర్పిస్తానని నమ్మించి 3 కిలోమీటర్ల దూరంలోని యూకలిప్టస్ వనాల్లోకి తీసుకువెళ్లి సాయంత్రం దాదాపు 5–30 నిముషాలకు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సుమారు 7 గంటలకు ఆ బాలికను ఇంటికి తిరిగి తీసుకువచ్చి ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాలిక విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండగా తల్లి దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా వైద్యాధికారి రవిచంద్ర బాలికను పరీక్షించి అసలు విషయం తెలిపారు. అలాగే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎంఎల్‌సీ కేసుగా నమోదు చేసి బాలికను అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్పీ అన్నారు. బాలిక తండ్రి గతంలోనే చనిపోగా, పిల్లలు తల్లి సంరక్షణలో వున్నారు. బాలిక అక్క స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతుండగా, తమ్ముడు స్థానిక గిరిజనసంక్షేమ ఆశ్రమపాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఏఎస్పీతో పాటు స్థానిక సీఐ కేఎ¯ŒS. మోహనరెడ్డి, ఎస్సై రవికుమార్, జడ్డంగి ఎస్సై నాగార్జున వున్నారు.
Advertisement
Advertisement