
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పశ్చిమగోదావరి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనలో బాలికను ఏలూరు తరలించి వైద్యం చేయించారు. చిన్నారి కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం చిన్నారి ఇంటి వద్ద కోలుకుంటోంది. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఘటన వివరాలు ఎస్సై ఎం.సాగర్‌బాబు వెల్లడించారు. డాంగేనగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారిని కాకి శ్రీకాంత్ అనే యువకుడు ముద్దాడుతూ సమీపంలోని చెట్లలోకి తీసుకువెళ్లి శుక్రవారం అత్యాచారం చేశాడు.
బాలికను తీసుకెళ్లటం ఆమె బంధువు ఒకామె చూసింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లి వెతుకుతుండగా, ఆమెకు శ్రీకాంత్ తీసుకెళ్లినట్లు ఆ బంధువు చెప్పింది. సాయంత్రం చిన్నారి ఇంటికి వచ్చిన తరువాత బాధపడటాన్ని తల్లి గమనించింది. దీంతో వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారాన్ని పోలీసులకు తెలుపగా ఎస్సై ఆసుపత్రికి వెళ్లి బాలికకు చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.
చదవండి: ఐదేళ్ల ప్రేమ.. గుట్టల్లో వరలక్ష్మి మృతదేహం.. మాకు దిక్కెవరు బిడ్డా!
Comments
Please login to add a commentAdd a comment