వాసవీ మాత.. ఆరాధ్య దేవత
వాసవీ మాత.. ఆరాధ్య దేవత
Published Mon, Jan 30 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
పెనుగొండ (ఆచంట): జైæ వాసవీ.. జై జై వాసవాంబాయనమః స్మరణలు మార్మోగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఆదివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పెనుగొండకు తరలివచ్చారు. మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్రా్తలు సమర్పించి వెండి పల్లకిపై గ్రామోత్సవం నిర్వహించారు. బజారు రామాలయం నుంచి వాసవీ దీక్షధారులు, 102 కలశాలతో మహిళలు, వాసవీ భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆలయానికి చేరుకున్నారు.
దీక్షల విరమణ
వాసవీ దీక్షధారులు పెనుగొండ వాసవీ ఆలయంలో, వాసవీ ధాంలో దీక్షలు విరమించారు. మాలధారులు అధికంగా కర్నాటక, కోయంబత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చారు. వేద పండితులు రామడుగుల నర్సింహమూ ర్తి ఆధ్వర్యంలో సుమారు 815 మంది దీక్షధారులు 102 హోమకుండ కృతువులో పాల్గొని దీక్షలు విరమించారు. ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోయంబత్తూరు భక్తులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వాసవీ యువజన సంఘం ఆధ్వర్యంలో దీక్ష విరమణ హోమాలు నిర్వహించారు. ఈవో కె.శ్రీనివాస్, ప్రత్యేకాధికారి కుడుపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దేవాదాయశాఖకు చెందిన 15 మంది ఈవోలు, మేనేజర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు ఎన్‌వీ రమణమూర్తి, గ్రంధి రాము, నూలి ప్రభాకరరా వు, యువజన సంఘ నాయకులు పచ్చిపులుసు శంకర్, ఉద్దగిరి శ్రీధర్(దత్తు) తదితరులు పాల్గొన్నారు.
అమ్మను కొలిస్తే మోక్షం
వాసవీమాతను భక్తిశ్రద్ధలతో కొలిస్తే మోక్షం లభిస్తుందని వాసవీ పెనుగొండ పీఠాధిపతి స్వామీ కృష్ణానందపురి స్వామీజీ అన్నారు. వాసవీ ధాంలో భక్తులనుద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజు, ట్రస్ట్ సభ్యులు కేఆర్ కృష్ణ, అశ్వత్ నారాయణ, పిప్పళ్ల వెంకటేశ్వరరావు, స్థానిక ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement