pengonda
-
పర్యాటక కేంద్రంగా దొంగరావిపాలెం
దొంగరావిపాలెం (పెనుగొండ) : దొంగరావిపాలెంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. మంగళవారం దొంగరావిపాలెంలోజరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దొంగరావిపాలెం వద్ద లంకభూములు, గోదావరిలో నీటి నిల్వలు ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటికే రూ.36 లక్షలతో పర్యాటక కేంద్ర పనులు ప్రారంభమయ్యాయన్నారు. బోటు షికారు, విశ్రాంతి ప్రాంతాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే ఏటిగట్టు పొడవునా రెస్టారెంట్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో దొంగరావిపాలెం పర్యాటకులతో కళకళలాడేవిధంగా నిర్మాణాత్మకమైన ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందన్నారు. పర్యాటక కేంద్రాలైన దిండి, పెదమల్లం, దొంగరావిపాలెంలను అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. దీంతో యువతకు ఉపాధి సైతం దొరుకుతుందన్నారు. సమావేశంలో పెనుగొండ, ఆచంట ఏఎంసీ చైర్మన్లు సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్‌బాబు, పీహెచ్సీ చైర్మన్ కేతా సత్తిబాబు, దొంగరావిపాలెం, సిద్ధాంతం సర్పంచ్‌లు పమ్మి మురళీ వెంకటేశ్వరరావు, బిరుదగంటి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. -
వాసవీ మాత.. ఆరాధ్య దేవత
పెనుగొండ (ఆచంట): జైæ వాసవీ.. జై జై వాసవాంబాయనమః స్మరణలు మార్మోగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఆదివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పెనుగొండకు తరలివచ్చారు. మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్రా్తలు సమర్పించి వెండి పల్లకిపై గ్రామోత్సవం నిర్వహించారు. బజారు రామాలయం నుంచి వాసవీ దీక్షధారులు, 102 కలశాలతో మహిళలు, వాసవీ భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. దీక్షల విరమణ వాసవీ దీక్షధారులు పెనుగొండ వాసవీ ఆలయంలో, వాసవీ ధాంలో దీక్షలు విరమించారు. మాలధారులు అధికంగా కర్నాటక, కోయంబత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చారు. వేద పండితులు రామడుగుల నర్సింహమూ ర్తి ఆధ్వర్యంలో సుమారు 815 మంది దీక్షధారులు 102 హోమకుండ కృతువులో పాల్గొని దీక్షలు విరమించారు. ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోయంబత్తూరు భక్తులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వాసవీ యువజన సంఘం ఆధ్వర్యంలో దీక్ష విరమణ హోమాలు నిర్వహించారు. ఈవో కె.శ్రీనివాస్, ప్రత్యేకాధికారి కుడుపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దేవాదాయశాఖకు చెందిన 15 మంది ఈవోలు, మేనేజర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ రమణమూర్తి, గ్రంధి రాము, నూలి ప్రభాకరరా వు, యువజన సంఘ నాయకులు పచ్చిపులుసు శంకర్, ఉద్దగిరి శ్రీధర్(దత్తు) తదితరులు పాల్గొన్నారు. అమ్మను కొలిస్తే మోక్షం వాసవీమాతను భక్తిశ్రద్ధలతో కొలిస్తే మోక్షం లభిస్తుందని వాసవీ పెనుగొండ పీఠాధిపతి స్వామీ కృష్ణానందపురి స్వామీజీ అన్నారు. వాసవీ ధాంలో భక్తులనుద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజు, ట్రస్ట్ సభ్యులు కేఆర్ కృష్ణ, అశ్వత్ నారాయణ, పిప్పళ్ల వెంకటేశ్వరరావు, స్థానిక ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు సాయికుమారి
పెనుగొండ :డిసెంబర్ నెలలో మణిపూర్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ ఫెన్సింగ్ పోటీలకు పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ సైన్సు కళాశాల విద్యార్థి డి.సాయికుమారి ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నడింపల్లి సూర్యనారాయణ రాజు తెలిపారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సాయి కుమారి ప్రతిభ చూపినట్టు చెప్పారు. ఆమెను కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ కె.రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, అధ్యాపకులు అభినందించారు. -
రైతుల హక్కులను గౌరవించాలి
పెనుగొండ : అన్నదాత మనోభావాలను గుర్తిస్తూ, వారికి భూమిపై ఉన్న హక్కులను ప్రభుత్వాలు గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి మాజీ సభ్యులు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన మానవహక్కుల విద్య జాతీయ సదస్సు ముగింపు సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ది అంటూ ప్రభుత్వాలు రైతుల హక్కులను హరించివేస్తున్నాయన్నారు. వారి మనోభావాలు పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే భూసమీకరణ అని, రైతులు భూమి ఇవ్వడానికి నిరాకరిస్తే ‘భూసేకరణ’ అనే భావనలను చట్టం ద్వారా రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు సేకరించారని వివరించారు. రాజకీయ హక్కుల కోసం చేపట్టిన ఉద్యమాలు విజయవంతమయ్యాయని, ఆర్థిక, సామాజిక హక్కులపై చేసిన ఉద్యమాలు విజయవంతం కాలేదని వివరించారు. మానవ హక్కుల విద్యతో ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుందన్నారు. డాక్టర్ దుర్గాభాయ్ దేశ్ముక్ మహిళా విద్యా కేంద్రంకు చెందిన ఆచార్య బి.రత్నకుమారి మాట్లాడుతూ సమాజంలో సమానత్వపు హక్కులేకుండా మహిళకు రెండవ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. గర్భస్త శిశువు ఆడపిల్ల అయితే, గర్భస్రావం చేయించుకునే సమాజంలో బతుకుతున్నామన్నారు. దేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి సమానం కానంత వరకూ పురుషుల ఆధిపత్యం, అత్యాచారాలు, గృహహింసలు జరుగుతూనే ఉంటాయన్నారు. విశ్వ విద్యాలయాలు ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ సబ్జెక్టులో మహిళా సాధికారత అంశాన్ని చేర్చాలన్నారు. మహిళల స్వీయరక్షణకు కరాటే విద్యను ప్రభుత్వం నేర్పించి ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్నారు. జాతీయ సదస్సు ద్వారా ప్రభుత్వానికి, యూజీసీకి పంపే నివేదిక వీటిని చేర్చాలన్నారు. 91 పరిశోధన పత్రాలు జాతీయ సదస్సులో124 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, 91 పరిశోధనాపత్రాలు సమర్పించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ నరసింహరాజు తెలిపారు. పరిశోధన పత్రాలను సావనీర్‌గా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సెమినార్ సంచాలకులు డాక్టర్ ఎన్.సూర్యనారాయణరాజు, పాలకవర్గ ఉపాధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి పీవీ సుబ్రహ్యణ్యంరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, పిల్లి పుల్లంశెట్టి, కాకర శశికుమార్, కేవీ సురేష్‌బాబు పాల్గొన్నారు. -
రైతుల హక్కులను గౌరవించాలి
పెనుగొండ : అన్నదాత మనోభావాలను గుర్తిస్తూ, వారికి భూమిపై ఉన్న హక్కులను ప్రభుత్వాలు గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి మాజీ సభ్యులు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన మానవహక్కుల విద్య జాతీయ సదస్సు ముగింపు సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ది అంటూ ప్రభుత్వాలు రైతుల హక్కులను హరించివేస్తున్నాయన్నారు. వారి మనోభావాలు పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే భూసమీకరణ అని, రైతులు భూమి ఇవ్వడానికి నిరాకరిస్తే ‘భూసేకరణ’ అనే భావనలను చట్టం ద్వారా రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు సేకరించారని వివరించారు. రాజకీయ హక్కుల కోసం చేపట్టిన ఉద్యమాలు విజయవంతమయ్యాయని, ఆర్థిక, సామాజిక హక్కులపై చేసిన ఉద్యమాలు విజయవంతం కాలేదని వివరించారు. మానవ హక్కుల విద్యతో ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుందన్నారు. డాక్టర్ దుర్గాభాయ్ దేశ్ముక్ మహిళా విద్యా కేంద్రంకు చెందిన ఆచార్య బి.రత్నకుమారి మాట్లాడుతూ సమాజంలో సమానత్వపు హక్కులేకుండా మహిళకు రెండవ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. గర్భస్త శిశువు ఆడపిల్ల అయితే, గర్భస్రావం చేయించుకునే సమాజంలో బతుకుతున్నామన్నారు. దేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి సమానం కానంత వరకూ పురుషుల ఆధిపత్యం, అత్యాచారాలు, గృహహింసలు జరుగుతూనే ఉంటాయన్నారు. విశ్వ విద్యాలయాలు ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ సబ్జెక్టులో మహిళా సాధికారత అంశాన్ని చేర్చాలన్నారు. మహిళల స్వీయరక్షణకు కరాటే విద్యను ప్రభుత్వం నేర్పించి ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్నారు. జాతీయ సదస్సు ద్వారా ప్రభుత్వానికి, యూజీసీకి పంపే నివేదిక వీటిని చేర్చాలన్నారు. 91 పరిశోధన పత్రాలు జాతీయ సదస్సులో124 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, 91 పరిశోధనాపత్రాలు సమర్పించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ నరసింహరాజు తెలిపారు. పరిశోధన పత్రాలను సావనీర్‌గా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సెమినార్ సంచాలకులు డాక్టర్ ఎన్.సూర్యనారాయణరాజు, పాలకవర్గ ఉపాధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి పీవీ సుబ్రహ్యణ్యంరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, పిల్లి పుల్లంశెట్టి, కాకర శశికుమార్, కేవీ సురేష్‌బాబు పాల్గొన్నారు.