జాతీయస్థాయి పోటీలకు సాయికుమారి
జాతీయస్థాయి పోటీలకు సాయికుమారి
Published Wed, Nov 9 2016 10:51 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పెనుగొండ :డిసెంబర్ నెలలో మణిపూర్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ ఫెన్సింగ్ పోటీలకు పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ సైన్సు కళాశాల విద్యార్థి డి.సాయికుమారి ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నడింపల్లి సూర్యనారాయణ రాజు తెలిపారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సాయి కుమారి ప్రతిభ చూపినట్టు చెప్పారు. ఆమెను కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ కె.రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, అధ్యాపకులు అభినందించారు.
Advertisement
Advertisement