అనుగ్రహ మాధుర్యం | Purnam special story | Sakshi
Sakshi News home page

అనుగ్రహ మాధుర్యం

Published Fri, Aug 24 2018 12:35 AM | Last Updated on Fri, Aug 24 2018 12:35 AM

Purnam special story - Sakshi

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా ప్రాంతాల ఆచారాలకు అనుగుణంగా పూజా విధానం ఉంటుంది. కొందరు నారికేళానికి పసుపుకుంకుమలు అలంకరించి కలశం మీద ఉంచి పూజిస్తారు. మరికొందరు నారికేళానికి మైదా పిండితో కళ్లు, ముక్కు, చెవులు అలంకరించి కలÔ¶ ం మీద ఉంచి అర్చిస్తారు. ఇంకొందరు నారికేళాన్ని అమ్మవారిగా అలంకరించి, ఒక పెద్ద బిందెకు పట్టు చీర కట్టి అచ్చు బాల వరలక్ష్మిలా అలంకరించి వ్రతం చేసుకుంటారు. ఈ పూజను స్త్రీలందరూ పవిత్రంగా చేసుకుంటారు. ఈ పండుగనాడు కొన్ని ప్రాంతాలలో తొమ్మిది రకాల పిండి వంటలు తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, పరమాన్నం, ఆవిరి కుడుములు, బూరెలు, పచ్చి చలిమిడి, పానకం, వడ పప్పు, నారికేళం, గారెలు వంటివి నివేదన చేస్తారు. ప్రాంతాలకు అతీతంగా ఇంటింటా పులిహోర బూరెలు/బొబ్బట్లు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కొందరు రవ్వకేసరి వంటి మధుర పదార్థాలు కూడా తయారు చేస్తారు. శక్త్యానుసారం పిండివంటలు తయారుచేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.  ఏవి చేసినా చేయకపోయినా, పూర్ణం బూరెలను మాత్రం తప్పనిసరిగా తయారు చేస్తారు. అందుకోసం 

కావలసినవి: సెనగ పప్పు – ఒక కప్పు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా; మినప్పప్పు – అర కప్పు; బియ్యం – రెండు కప్పులు; ఉప్పు – చిటికెడు; నూనె – బూరెలు వేయించడానికి తగినంత
తయారీ: ∙ముందురోజు రాత్రి మినప్పప్పు, బియ్యం కలిపి తగినన్ని నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, ఉప్పు జత చేసి గ్రైండర్‌లో వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బుకోవాలి ∙సెనగ పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి ∙ఉడికిన పప్పును బయటకు తీసి, నీరు ఉంటే పూర్తిగా ఒంపేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙బెల్లం తరుగు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, గిన్నెలోకి తీసుకోవాలి ∙(పల్చగా వస్తే, ఒకసారి స్టౌ మీద ఉంచి, గట్టిపడేవరకు ఉడికించాలి) ఏలకుల పొడి జత చేయాలి ∙చిన్న చిన్న పూర్ణాలు (ఉండలు) గా చేసి పక్కన ఉంచాలి∙స్టౌ మీద
బాణలిలో నూనె వేసి కాగాక ఒక్కో ఉండను, పిండిలో ముంచి బూరెల మాదిరిగా నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి 
∙అమ్మవారికి నివేదన చేసి, తొమ్మిది బూరెలను వాయనంగా ఇవ్వాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement