
కర్నటక, యశవంతపుర : ఇంటిలో శ్రావణ మాస పూజలు చేస్తున్న సమయంలో తండ్రి, కొడుకు బిర్యాని తినడంతో భార్య అలిగి ఇల్లు వదిలివెళ్లి పోయిన సంఘటన నగరంలో జరిగింది. వివరాలు... ఇక్కడి కమ్మగొండనహళ్లిలో రాజు దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం రాజు, అతని కుమారుడు ఆదర్స్‌లు హోటల్ నుంచి బిరియాని తెప్పించుకుని తిన్నారు. విషయం గ్రహించిన భార్య ఇద్దరితో గొడవ పడింది. గురువారం ఉదయం రాజు విధులకు వెళ్లగా ఆయన భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆమెకు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment