
బనశంకరి: నగరంలోని హజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న పాదరాయనపుర దాడి నిందితులు తమకు బిర్యాని కావాలని పట్టుబడుతున్నారు. రామనగరజైలులో ఐదుగురికి కరోనా నిర్ధారణ కావడంతో అక్కడినుంచి 116 మందికిపైగా నిందితులను హజ్‌భవనంలోని క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. జైలులో అందించే ఆహారాన్నే ఇక్కడ కూడా అందజేస్తున్నారు. అయితే వీరిలో కొందరు తమకు బిర్యాని భోజనం పెట్టాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు. (ముప్పుతిప్పలు పెడుతున్న మూడు వైరస్‌లు)
ప్రసూతి ఆసుపత్రిని మూసివేసిన బీబీఎంపీ హంపినగరలో ఓ మహిళకు కరోనా సోకడంతో మూడలపాళ్య ప్రసూతి ఆసుపత్రిని బీబీఎంపీ అధికారులు మూసివేశారు. మూడలపాళ్య ప్రసూతి ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులను క్వారంటైన్‌కు తరలించి ప్రసూతి ఆసుపత్రిని మూసివేశామని బీబీఎంపీ అధికారులు తెలిపారు. (లాక్‌డౌన్ ఎత్తివేతకు పంచతంత్రం!)
Comments
Please login to add a commentAdd a comment