వెల్దుర్తి, న్యూస్‌లైన్: మంత్రశాస్త్రం బలహీనం కావడంతో వందల ఏళ్లనాటి ప్రాచీన దేవాలయాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయని హిందూ దేవాలయ ప్రతిష్ఠాపన పీఠాధిపతి పూజ్యశ్రీ కమలానంద భారతి స్వామిజీ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణమాసం, నాగులపంచమిని పురస్కరించుకొని వెల్దుర్తిలోని నాలు గు వందల ఏళ్లనాటి శ్రీరాజరాజేశ్వరీ దేవాలయంలో ఆదివారం నాగ ప్రతిష్ఠ, నందీశ్వరుడు, శివలింగాలను ప్రాణప్రతిష్ఠాపన గావించారు. 1300 ఏళ్లనాడు ప్రాచీన రాజుల కాలంలో నిర్మించిన అనంత పద్మనాభస్వామి దేవాలయం, పలు కళాఖండాలను ఆయన పరిశీలించారు. విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలోని జగన్మోహన-జగన్మోహిని విగ్రహాన్ని పరిశీలించారు. ఇలాంటి విగ్రహం తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ లో ఉందన్నారు. ప్రాచీన కాలంలో దైవభక్తితోపాటు ప్రకృతి చింతన సా మాజిక జీవనం కోసం ఈ కళాఖండాలను మంత్రశాస్త్రం ప్రకారం నిర్మిం చారని తెలిపారు. దేశంలో పాశ్చాత్య పోకడలు అధికమై కొన్ని సంపన్న వర్గాల ప్రజలు మత మార్పిడి వ ల్ల హిందూ ధర్మానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేవాలయాలు నిర్మించి దేవ తా మూర్తులను ప్రతిష్ఠించడంతోనే పనైపోయిందని అనుకోకుండా నిత్యం ధూప, దీప నైవేద్యాలు, పూజలు, అన్నదానం, భజనలు చేస్తేనే సార్థకత ఏర్పడుతుందన్నారు. అంతకుముందు ఆలయ నిర్మాణ కుటుంబీకులు స్వామిజీకి పూర్ణకుభంతో స్వాగతం పలికారు. ఆలయం లో ఏడోతరం వారు వేదబ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణాల మధ్య పూర్ణాహుతి, రుద్రహోమం, అభిషేకాలు నిర్వహించారు. శ్రీరాజరాజేశ్వరీ దేవికి పట్టువస్త్రాలు, ఆభరణా లు, పసుపు, కుంకుమ, గంధంతో దివ్యసుందరిగా అలంకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.