మార్మోగిన గోవింద నామస్మరణ | sravana sanivaram poojas | Sakshi
Sakshi News home page

మార్మోగిన గోవింద నామస్మరణ

Aug 19 2017 9:52 PM | Updated on Jun 1 2018 8:39 PM

మార్మోగిన గోవింద నామస్మరణ - Sakshi

మార్మోగిన గోవింద నామస్మరణ

‘ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా గోవిందా’ అంటూ భక్తుల శరణుఘోషతో ఆలయాలు మార్మోగాయి.

– నేత్రపర్వంగా శ్రావణ శనివార పూజలు
– పోటెత్తిన భక్తులు.. ఆలయాల కిటకిట


అనంతపురం కల్చరల్‌: ‘ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా గోవిందా’ అంటూ భక్తుల శరణుఘోషతో ఆలయాలు మార్మోగాయి. శ్రావణమాసం చివరి శనివారం కావడంతో నగరంలోని పలు ఆలయాల్లో పూజలు జరిగాయి. వివిధ ఆలయాల్లో పోటెత్తిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. లడ్డూప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక కొత్తూరు వాసవీకన్యకా పరమేశ్వరి ఆలయం, ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయం, రామనగర్, హౌసింగ్‌ బోర్డు వేంకటేశ్వరాలయాల్లో అధిక సంఖ్యలో మహిళలు ఏడు శనివారాల వ్రతమాచరించారు. అలాగే జీసెస్‌నగర్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయం, మారుతీనగర్‌ వరదాంజనేయస్వామి ఆలయంలోనూ శ్రావణ శనివార పూజలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement