sanivaram poojas
-
నృసింహాలయంలో పోటెత్తిన భక్తజనం
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో పోటెత్తింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా భక్తులు తమ ఇలవేల్పు దేవుడు నారసింహుని దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నారు. ఈసారి భక్తుల సంఖ్య బాగా పెరిగిందని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు. జిల్లా వాసులతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు విచ్చేశారు. ఆలయ ప్రాంగణం ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవిందా..’ అనే నామస్మరణతో మార్మోగింది. -
మార్మోగిన గోవింద నామస్మరణ
– నేత్రపర్వంగా శ్రావణ శనివార పూజలు – పోటెత్తిన భక్తులు.. ఆలయాల కిటకిట అనంతపురం కల్చరల్: ‘ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా గోవిందా’ అంటూ భక్తుల శరణుఘోషతో ఆలయాలు మార్మోగాయి. శ్రావణమాసం చివరి శనివారం కావడంతో నగరంలోని పలు ఆలయాల్లో పూజలు జరిగాయి. వివిధ ఆలయాల్లో పోటెత్తిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. లడ్డూప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక కొత్తూరు వాసవీకన్యకా పరమేశ్వరి ఆలయం, ఆర్ఎఫ్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయం, రామనగర్, హౌసింగ్ బోర్డు వేంకటేశ్వరాలయాల్లో అధిక సంఖ్యలో మహిళలు ఏడు శనివారాల వ్రతమాచరించారు. అలాగే జీసెస్నగర్లోని పెద్దమ్మ తల్లి ఆలయం, మారుతీనగర్ వరదాంజనేయస్వామి ఆలయంలోనూ శ్రావణ శనివార పూజలు జరిగాయి. -
పావగడలో పోటెత్తిన భక్తులు
పావగడ: శ్రావణ మాసం సందర్భంగా స్థానిక శనీశ్వరాలయంలో తృతీయ శ్రావణ శనివారోత్సవం శనివారం అపురూపంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దర్శనం కోసం ఏర్పాటు చేసిన 3 క్యూ లైన్లలో భక్తులు శుక్రవారం రాత్రి నుంచే బారులు తీరారు. ఉదయం 4 గంటలకే పూజలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా సమీపంలోని శీతలాంబదేవి, కోటె ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయస్వామి వారికి భక్తులు పూజలు చేశారు. దీక్షా మండపంలో భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా అన్నదానం చేశారు. -
ఘనంగా శ్రావణమాస పూజలు
అనంతపురం కల్చరల్: శ్రావణ శనివారం సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అశోక్‌నగర్‌లోని హరిహరఆలయం, ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం, రాంనగర్, హౌసింగ్ బోర్డు వేంకటేశ్వర ఆలయాల్లో పెద్ద ఎత్తున మహిళలు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించారు. ఆలయాల్లో స్వామివారికి తోమాలసేవ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రామ్‌నగర్‌లోని కోదండరామాలయం, మారుతీనగర్ వరదాంజనేయస్వామి ఆలయంలో శ్రావణ శనివార పూజలు జరిగాయి. -
మార్మోగిన గోవింద నామస్మరణ
అనంతపురం కల్చరల్: శ్రావణంలో వచ్చిన రెండో శనివారం రోజుల నగరంలోని వైష్ణావాలయాలు కిటకిటలాడాయి. వివిధ ఆలయాల్లో గోవింద నామస్మరణ మార్మోగింది. ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏడు శనివారాల పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. స్వామివారికి తోమాల సేవ, అభిషేకాలు, అర్చన జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు విశ్వనాథరెడ్డి, శంకరరెడ్డి, ఫ్లెక్స్ రమణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక రామనగర్, హౌసింగ్ బోర్డు వేంకటేశ్వరాలయాల్లో వందల సంఖ్యలో మహిళలు బారులు తీరి ఏడు శనివారాల వ్రతమాచరించారు. కోర్టురోడ్డు వరదాంజనేయస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున శ్రావణ శనివారం పూజలు జరిగాయి.