మార్మోగిన గోవింద నామస్మరణ | sravana sanivaram poojas in anantapur | Sakshi
Sakshi News home page

మార్మోగిన గోవింద నామస్మరణ

Published Sat, Aug 5 2017 9:30 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

మార్మోగిన గోవింద నామస్మరణ - Sakshi

మార్మోగిన గోవింద నామస్మరణ

అనంతపురం కల్చరల్‌: శ్రావణంలో వచ్చిన రెండో శనివారం రోజుల నగరంలోని వైష్ణావాలయాలు కిటకిటలాడాయి. వివిధ ఆలయాల్లో గోవింద నామస్మరణ మార్మోగింది. ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏడు శనివారాల పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. స్వామివారికి తోమాల సేవ, అభిషేకాలు, అర్చన జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు విశ్వనాథరెడ్డి, శంకరరెడ్డి, ఫ్లెక్స్‌ రమణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక రామనగర్, హౌసింగ్‌ బోర్డు వేంకటేశ్వరాలయాల్లో వందల సంఖ్యలో మహిళలు బారులు తీరి ఏడు శనివారాల వ్రతమాచరించారు. కోర్టురోడ్డు వరదాంజనేయస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున శ్రావణ శనివారం పూజలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement