ఉప్పొంగిన భక్తి పారవశ్యం | Devotees throng temples in huge number on Varalaxmi Varatham | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన భక్తి పారవశ్యం

Published Sat, Aug 17 2013 4:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

Devotees throng temples in huge number on Varalaxmi Varatham

వర్గల్, న్యూస్‌లైన్: శుభకర శ్రావణ శుక్రవారం రోజు న జిల్లాలో సుప్రసిద్ధమైన వర్గల్ విద్యాధరి, నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. విద్యా సరస్వతి అమ్మవారు ఈ విశేష పర్వదినంన వరాల తల్లి వరలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించేందుకు హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలు, పరిసర జిల్లా ల భక్తులు,స్థానిక జిల్లా వాసులు క్షేత్రానికి తరలి వచ్చారు. దీంతో క్షేత్రం రద్దీగా మారింది. మరోవైపు శ్రావణ వరలక్ష్మి వ్రత విశిష్టత దృష్ఠ్యామహిళలు పరస్ప రం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
 
 నాచగిరిలో..
 శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహక్షేత్రంలో సత్యనారాయణ వ్రతాల సందడి నెలకొన్నది. ఆలయ పుష్కరిణిలో పుణ్య స్నానాలాచరించి వ్రత మండపంలో దంపతులు సత్యదేవుని సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు. వ్రతానంతరం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. వ్రతఫలం పొందారు. మరోవైపు ‘మన గుడి’ కార్యక్రమంలో భాగంగా వ్రతాలు ఆచరించిన భక్తులకు ఆలయం తరఫున ప్రత్యేకంగా ప్రసాదా లు అందజేశారు. నాచగిరి క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వారి సన్నిధిలో అంకురారోపణతో ఆలయ అర్చక స్వాములు ఉత్సవాలకు శ్రీకారం చుట్టా రు. పవిత్రోత్సవాలు పురస్కరించుకుని ఈ నెల 19 వరకు స్వామి వారి కల్యాణా లు ఉండవని ఆలయ ముఖ్య అర్చకులు కృష్ణమాచార్యులు తెలిపారు. శనివారం  అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభ స్థాపనాది కార్యక్రమాలు ఉంటాయన్నారు.
 
 ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
 నారాయణఖేడ్ రూరల్: శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని నారాయణఖడ్ మండలంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజ లు చేశారు. మహిళలు ఇళ్ళల్లో వరలక్ష్మి వ్రతాలు, వైభవ లక్ష్మి పూజలు జరిపా రు. పట్టణంలోని సరస్వతీ శిశుమందిరంలో ఉదయం ప్రారంభమైన వరలక్ష్మీ వ్రతం మధ్యాహ్నం 2 గంటల వర కు కొనసాగింది. 51మంది మహిళలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వక్తగా హాజరైన కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహరాజ్ మాట్లాడుతూ  సామూహిక వ్రత కార్యక్రమాలు నిర్వహించడంతో కుటుంబాల్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నారు. శ్రావణమాసం భారతీయ మహిళలకు పవిత్రమైన మాసమని చెప్పారు. కార్యక్రమం లో నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావ్ షెట్కార్ సతీమణి శ్వేతాషెట్కార్, వైద్యురాలు సుష్మ, పాఠశాల అధ్యక్షులు మాణిక్‌ప్రభు, పాఠశాల కార్యదర్శి శివకుమా ర్, ప్రధానాచార్యులు జి.సంజీవ్‌రెడ్డి, వైద్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యాభారతి  పాఠశాల ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిం చారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి సతీమణి గాళె మ్మ హాజరై పూజలు నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో వ్రతానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement