Varalaxmi Varatham
-
శ్రావణ సుమగంధం
బిజీలైఫ్.. పొట్టి జడను, పోనీ టెయిల్‌ను సపోర్ట్ చేసినా, అకేషనల్ షెడ్యూల్ మాత్రం వాలుజడ.. పూలజడనే సవరిస్తోంది! ఇందుకు సాక్ష్యం.. ఈ వరలక్ష్మీ వ్రతమే! అయితే ఈ అలంకరణను ఇదివరకటిలా అమ్మ.. అత్తమ్మ... అమ్మమ్మలు చేయట్లేదు స్పెషల్ డిజైనర్లు అల్లుతున్నారు అందంగా.. సంస్కృతిని చాటే పండుగపబ్బాలకు సంప్రదాయ సోకులే అసలైన ఆకర్షణ. అందుకే మామూలప్పుడు ఎలా ఉన్నా పర్వదినాలకు మాత్రం బారెడు జడ.. మూరెడుపూలతో కాంతులీనుతుంటారు కాంతలు. ఈ అలంకరణ ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల అమ్మమ్మల దాకా అందరికీ ప్రీతిపాత్రమే! ఇంతకుముందు ఈ జడల్లో మల్లెలు, మరువాలు, బంతులు, చేమంతులు, కనకాంబరాలు చేరేవి. కట్టేది చీరైనా, పరికిణీ జాకెట్టయినా.. ఓణీ అయినా పూలు ఇవే! జడలో తురిమే వైనమూ అదే! ఇపుడు.. కాలం మారింది. అభిరుచి పాతదే అయినా అమలయ్యే తీరు కొత్తందాన్ని సంతరించుకుంది. విదేశీపుష్పాలు సైతం కురులకు కలరింగ్ ఇస్తున్నాయి. కొంచెం సృజన ఉన్నవాళ్లు ఈ జడను అప్డేట్ చేసి పూలజడ డిజైనర్లుగా అడ్రస్ చాటుకుంటున్నారు. పువ్వులతో పాటు.. బుజ్జిబుజ్జి నడకల తన బుజ్జాయి బుల్లి జడకు పువ్వులు భారమవుతాయని అమ్మలు భావిస్తే.. వీసమెత్తు బరువులేని కనకాంబరంలాంటి పూలతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలను జడ ఒంపుల్లో చేర్చి ఆ బిడ్డల్ని బంగారు బొమ్మల్లా తీర్చిదిద్దుతున్నారు. అరచేతి వెడల్పున డిజైన్లు సృష్టించి, వాటిని జడ పొడవునా పొదుగుతున్నారు. సిగ్గులొలికే పెళ్లికూతురి కోసం మల్లెమొగ్గలతో జడను కుడుతున్నారు. అత్తారింట జరిగే రిసెప్షన్‌కి ఆ అపరంజి ఇంకాస్త అందంగా కనిపించడానికి ఆమె జడపై నెమళ్లను నాట్యమాడిస్తున్నారు. ఇలా ఒక్కో వేడుకకు ఒక్కో విధమైన వైవిధ్యాన్ని పూలజడల్లో చూపిస్తున్నారు. రంగులను బట్టి.. చీర.. లంగా ఓణీల రంగులను బట్టి పువ్వులను.. వాటి చుట్టూ వాడే పూసలను ఎంచుకుంటున్నారు. తెలుపు చీరకు ప్రకృతి ఇచ్చిన మల్లె, లిల్లీ సుమాలు.. మధ్య మధ్యలో ముత్యాలు, కృత్రిమంగా చేసిన గోల్డ్ ఫ్లవర్స్, మోటివ్స్ని జతచేర్చి జడలో కూర్చుతున్నారు. ఆకుపచ్చ రంగు చీరయితే సంపంగి, మరువాన్ని అల్లేసి ఇతర పువ్వులను, మోటివ్స్ను, రకరకాల జడబిళ్లలను కలిపేస్తున్నారు. వంకాయ రంగుకు ఆర్కిడ్స్, డబుల్ షేడెడ్ పువ్వులు కావాలనుకుంటే కార్నిషన్ వాడుతున్నారు. ఈ పూలజడలు డిజైన్‌ను బట్టి ధర.రూ.2,000/- నుంచి 3,500/- వరకు లభిస్తున్నాయి. మరింత ఖరీదైన జడబిళ్లలు వాడాలంటే ఖర్చు దానికి తగిన విధంగానే ఉంటుంది. జడబిళ్లలు, ఇతర యాక్సెసరీస్ మన హైదరాబాద్‌లోనే దొరుకుతాయి. - విజయారెడ్డి ‘ఏ చిన్న వేడుకైనా అమ్మాయిల అలంకరణ కోసండిజైనర్ పూల జడలను అడుగుతున్నారు. ఈ మాసం నోములు, వ్రతాలలో అమ్మాయిలను లక్ష్మీదేవిలా అలంకరించాలనుకుంటారు. రాబోయే దసరా, నవరాత్రి, దీపావళి వేడుకల్లో.. పెళ్లి సంబరాల్లో డిజైనర్ పూలజడలకు మంచి గిరాకీ ఉంటోంది. ఆర్డర్ మీద వీటిని తయారుచేస్తుంటాం.’ - కల్పన రాజేష్, పూలజడల డిజైనర్, ఎల్.బి.నగర్ -
ఆంక్షల్లేని తెలంగాణ కావాలి
హన్మకొండ, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ఇచ్చినట్టే ఇచ్చి నిబంధనలు ఆంక్షలు విధిస్తోందని, తాము మాత్రం ఆంక్షల్లేని తెలంగాణనే కోరుకుంటున్నామని విప్లవ రచరుుతల సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మీ అన్నారు. సంఘం 24 రాష్ర్ట మహాసభలు శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలో ప్రారంభమయ్యాయి. పువ్వర్తి ఎన్కౌంటర్లో అమరుడైన మర్రి సుధాకర్ తల్లిదండ్రులు అయిలమ్మ, వెంకటయ్య చేతుల మీదుగా విరసం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభలో వరలక్ష్మీ మాట్లాడుతూ.. భౌగోళికంగా విడిపోయిన ప్రజలను మానసికంగా ఏకం చేసి సామ్రాజ్యవాద శక్తులు, హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా విరసం పోరాడుతుందని తెలిపారు. ప్రముఖకవి నందిని సిధారెడ్డి, ప్రజాకళామండలి గాయకుడు జాన్‌రావు, పౌరహక్కుల నేత ఎంటీ ఖాన్ కూడా మాట్లాడారు. విరసం రాష్ట్ర కార్యవర్గసభ్యులు, కవులు వరవరరావు, హేమలత, కళ్యాణ్‌రావు, కాకరాల, మాభూమి సంధ్య తదితరులు సభల్లో పాల్గొన్నారు. అనంతరం సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాలలో బహిరంగసభ జరిగింది. -
ఉప్పొంగిన భక్తి పారవశ్యం
వర్గల్, న్యూస్‌లైన్: శుభకర శ్రావణ శుక్రవారం రోజు న జిల్లాలో సుప్రసిద్ధమైన వర్గల్ విద్యాధరి, నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. విద్యా సరస్వతి అమ్మవారు ఈ విశేష పర్వదినంన వరాల తల్లి వరలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించేందుకు హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలు, పరిసర జిల్లా ల భక్తులు,స్థానిక జిల్లా వాసులు క్షేత్రానికి తరలి వచ్చారు. దీంతో క్షేత్రం రద్దీగా మారింది. మరోవైపు శ్రావణ వరలక్ష్మి వ్రత విశిష్టత దృష్ఠ్యామహిళలు పరస్ప రం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నాచగిరిలో.. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహక్షేత్రంలో సత్యనారాయణ వ్రతాల సందడి నెలకొన్నది. ఆలయ పుష్కరిణిలో పుణ్య స్నానాలాచరించి వ్రత మండపంలో దంపతులు సత్యదేవుని సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు. వ్రతానంతరం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. వ్రతఫలం పొందారు. మరోవైపు ‘మన గుడి’ కార్యక్రమంలో భాగంగా వ్రతాలు ఆచరించిన భక్తులకు ఆలయం తరఫున ప్రత్యేకంగా ప్రసాదా లు అందజేశారు. నాచగిరి క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వారి సన్నిధిలో అంకురారోపణతో ఆలయ అర్చక స్వాములు ఉత్సవాలకు శ్రీకారం చుట్టా రు. పవిత్రోత్సవాలు పురస్కరించుకుని ఈ నెల 19 వరకు స్వామి వారి కల్యాణా లు ఉండవని ఆలయ ముఖ్య అర్చకులు కృష్ణమాచార్యులు తెలిపారు. శనివారం అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభ స్థాపనాది కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు నారాయణఖేడ్ రూరల్: శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని నారాయణఖడ్ మండలంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజ లు చేశారు. మహిళలు ఇళ్ళల్లో వరలక్ష్మి వ్రతాలు, వైభవ లక్ష్మి పూజలు జరిపా రు. పట్టణంలోని సరస్వతీ శిశుమందిరంలో ఉదయం ప్రారంభమైన వరలక్ష్మీ వ్రతం మధ్యాహ్నం 2 గంటల వర కు కొనసాగింది. 51మంది మహిళలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వక్తగా హాజరైన కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహరాజ్ మాట్లాడుతూ సామూహిక వ్రత కార్యక్రమాలు నిర్వహించడంతో కుటుంబాల్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నారు. శ్రావణమాసం భారతీయ మహిళలకు పవిత్రమైన మాసమని చెప్పారు. కార్యక్రమం లో నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావ్ షెట్కార్ సతీమణి శ్వేతాషెట్కార్, వైద్యురాలు సుష్మ, పాఠశాల అధ్యక్షులు మాణిక్‌ప్రభు, పాఠశాల కార్యదర్శి శివకుమా ర్, ప్రధానాచార్యులు జి.సంజీవ్‌రెడ్డి, వైద్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యాభారతి పాఠశాల ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిం చారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి సతీమణి గాళె మ్మ హాజరై పూజలు నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో వ్రతానికి హాజరయ్యారు.