హన్మకొండ(వరంగల్):వరంగల్‌లోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రావాణమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని వరుణహోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, గుదిమళ్ల విజయకుమారాచార్యులు తదితరులు గణపతి నవగ్రహ మూలమంత్రయుక్త నామకచమకములతో వరుణసూక్త తైతరీయ విధానంలో వరుణహోమం, మహారుద్రహోమం చేపట్టారు. శ్రావణమాసోత్సవాల్లో భాగంగా శ్రీరుద్రేశ్వమహాశివలింగాన్ని 51 కిలోల పెరుగన్నంతో త్రయంభకేశ్వరునిగా అలంకరించి పూజలు జరిపారు.