Gangu Upendra Sharma
-
నేడు విశాఖ శారద పీఠాధిపతులకు పుష్పాభిషేకం
హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్యాధికారం చేపట్టేలా రాజశ్యామల యాగం నిర్వహించిన విశాఖ పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఇటీవల విశాఖ పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిలకు ఈ నెల 26న పుష్పాభిషేకం నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. రెజిమెంటల్‌బజార్‌లోని సంతోషీమాత దేవాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో బుధవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా పుష్పాభిషేకంతో పాటు స్వాత్మానందేంద్ర స్వామి పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున కట్టు, బొట్టుతో తరలిరావాలని సూచించారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు బ్రాహ్మణులకు అత్యధిక ప్రా«ధాన్యతనిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ శారదా పీఠం ఆ«ధ్వర్యంలో సాంస్కృతిక పాఠశాల, వేద పాఠశాల, సంస్కృత పాఠశాల నిర్వహణ కోసం కోకాపేటలో రెండు ఎకరాల స్థలం కేటాయించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అర్చకులకు ప్రభుత్వం నుంచి వేతనాలు అందిస్తున్నారని అభినందించారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడిగా శేషం రఘుకిరణాచార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాహ్మణ సంఘాల ముఖ్యులు పవన్‌కుమార్, భాస్కరభట్ల రామశర్మ, కులకర్ని నరేశ్, శ్రీపాదశర్మ తదితరులు పాల్గొన్నారు. -
వేయిస్తంభాల గుడిలో వరుణహోమం
హన్మకొండ(వరంగల్):వరంగల్‌లోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రావాణమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని వరుణహోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, గుదిమళ్ల విజయకుమారాచార్యులు తదితరులు గణపతి నవగ్రహ మూలమంత్రయుక్త నామకచమకములతో వరుణసూక్త తైతరీయ విధానంలో వరుణహోమం, మహారుద్రహోమం చేపట్టారు. శ్రావణమాసోత్సవాల్లో భాగంగా శ్రీరుద్రేశ్వమహాశివలింగాన్ని 51 కిలోల పెరుగన్నంతో త్రయంభకేశ్వరునిగా అలంకరించి పూజలు జరిపారు. -
దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాలి
తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి నిజాయితీ పరులైన అధికారులను నియమించాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ కోరారు. సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచారి అధ్యక్షతన ఆదివారం నగరంలో సమాఖ్య విస్తృత సమావేశం జరిగింది. గ్రామప్రాంతాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచాలని కోరారు. ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.920 కోట్లు వెంటనే చెల్లించే విధంగా స్థానిక టీడీపీ, బీజేపీ నేతలు కృషి చేయాలని కోరారు.విభజన చట్టం ప్రకారం టీటీడీ రూ.583కోట్లు, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లికార్జున తదితర 16 పెద్ద దేవాలయాల నుంచి రూ.337కోట్లు తెలంగాణకు కామన్‌గుడ్ ఫండ్, అర్చక వెల్ఫేర్ ఫండ్‌కు జమచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ లో 12,260 దేవాలయాల అభివృద్ధికి, అర్చక సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయిం చాలన్నారు. తెలంగాణ దేవాదాయశాఖలో ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.